`మా టైగ‌ర్‌...` ఎంపీ ర‌ఘురామకు న‌ర‌సాపురం యూత్ మ‌ద్ద‌తు!

Update: 2022-01-14 00:30 GMT
వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. మాట‌ల మాంత్రికుడు.. ఫైర్ బ్రాండ్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు..ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌కు ఆయన సొంత నియోజ క‌వ‌ర్గం ప‌శ్చిమ గోదావ‌రిలోని న‌ర‌సాపురం యూత్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అంతేకా దు.. వైసీపీ నాయ‌కులు.. త‌ర‌చుగా.. ర‌ఘురామను నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గుర్తుప‌ట్ట‌లేర‌ని వ్యాఖ్యానిం చారు. మ‌రికొంద‌రు..నేత‌లు.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి కూడా క‌నీసం పిట్ట‌కూడా ప‌ల‌క‌రించ‌ద‌ని ఎద్దేవా చేశారు. ఇంకొంద‌రు.. నాయ‌కులు.. ర‌ఘురామ పోటీ చేస్తే.. అన్నీఆయ‌నే చూసుకోవాలి.. జెండా మోసేవా డు.. నినాదా లు చేసేవాడు.. కూడా ఆయ‌నే అవుతాడంటూ.. వ్యాఖ్య‌లు చేశారు.

అయితే.. ఇప్పుడు ఇలాంటి కుక్క‌మూతి పిందెల కామెంట్ల‌కు ఆర్ ఆర్ ఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం యూత్ గ‌ట్టి స‌మాధానం చెప్పారు. సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఈనెల 14న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తాన‌ని ర‌ఘురామ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డి యూత్ ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూ.. భారీ ఎత్తున క‌టౌట్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ``మా.. టైగ‌ర్‌`` అంటూ..ర‌ఘురామ‌ను ఓన్ చేసుకున్న తీరు.. వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంద‌నే చెప్పాలి. ఎందుకంటే.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్న ఆర్ ఆర్ ఆర్‌కు.. ఇంత పెద్ద ఎత్తున అభిమానులు.. నెత్తిన పెట్టుకోవ‌డం.. ఇప్పుడు వైసీపీలో గుబులు రేపుతోంది.

అంతేకాదు.. ``పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు త‌ప్ప‌`` అని కార్ల్‌మార్క్స్ చేసిన వ్యాఖ్య‌ను ఈ ఫెక్సీల‌పై పేర్కొన్నారు. ఇది పూర్తిగా.. ర‌ఘురామ ఏపీ ప్ర‌భుత్వంపైనా..సీఎం జ‌గ‌న్‌పైనా చేస్తున్న పోరాటాన్ని ఉద్దేశించే పేర్కొన్నార‌నే చ‌ర్చ జోరుగాసాగుతోంది. అంటే.. అంతిమంగా.. ర‌ఘురామ‌దే విజ‌యం అని పేర్కొన్న‌ట్టు చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. ఈ ఫ్లెక్సీల‌పై ఒక‌వైపు.. తొడ‌కొడుతూ.. మీసం దువ్వుతున్న స్ట‌యిల్‌లో ఉన్న ర‌ఘురామ ఉంటే. కుడివైపు.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పౌరుషంతో కూడిన చూపుల‌తో న‌డుచుకుంటూ..వెళ్తున్న ఆంగికంలో ఉన్న ఫొటోను ముద్రించారు.  

పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరోతో పాటుగా రఘురామ రాజు ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 5 తరువాత రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని..తాను ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఏంటో నిరూపిస్తానని సవాల్ చేసారు. తన పైన అనర్హత వేటు వేసేందుకు ప్రయత్నాలు చేసుకోవాలంటూ వైసీపీకి ఛాలెంజ్ చేసారు. ఇదే సమయంలో ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లను బ‌ట్టి.. ఆయ‌న జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఫ్లెక్సీలుఏర్పాటు కావ‌డం.. మ‌రింత ఆస‌క్తిని రేపుతుండ‌గా..వైసీపీ నేత‌ల మ‌ధ్య మాత్రం గుబులు రేపుతోంది.
Tags:    

Similar News