శివప్రసాద్ వేషాలు మొదలయ్యాయ్

Update: 2016-04-25 10:14 GMT
శివప్రసాద్ వేషాలు మొదలయ్యాయ్
కొందరు మాట్లాడే మాటలు ఎలాంటి మంటలు రేపుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఆయన నోటి నుంచి వచ్చే ఒక్కో ఎంతటి రాజకీయ కదలికలను తీసుకొస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మరికొందరు ఎంతగా నెత్తినోరు కట్టుకున్నా పెద్దగా పట్టించుకునేవాళ్లు ఉండదు. నిరసన ప్రదర్శనల పేరుతో చేపట్టే చర్యలు మీడియాలో ప్రచారమే తప్పించి.. ఎవరి మీద విరుచుకుపడుతున్నారో వారి దృష్టికి వెళ్లే పరిస్థితి కనిపించదు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో.. టీఆర్ ఎస్ అధినేత వాదన తీవ్రతకు విభజన అనివార్యమైన సమయంలో దాన్ని అడ్డుకునేందుకు ఏపీ నేతల ఎంతగారో ప్రయత్నించారు. మరికొందరు అయితే..పార్లమెంటు దగ్గర వినూత్నంగా నిరసన చేశారు. అలాంటి నిరసన ప్రదర్శల్ని సీరియల్ మాదిరి చేసిన ఏపీ నేత ఎవరైనా ఉన్నారా అంటే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గా చెప్పాలి. విభజన సమయంలో.. ఏపీకి జరుగుతున్న నష్టాల్ని వివరించి చెప్పేందుకు..ఆయన విభజన తర్వాత ఏపీ ప్రత్యేక హోదా కోసం ఒకట్రెండు వేషాలు వేసిన శివప్రసాద్.. తాజాగా కుచేలుడి వేషంతో ఢిల్లీలో హడావుడి చేశారు. విజయ్ చౌక్ దగ్గర కుచేలుడి వేషంలో వచ్చిన ఆయన మోడీ సర్కారు మీద విమర్శలు చేరిగారు. నవ్వాంధ్ర నిర్మాణంలో కేంద్ర భాగస్వామం అవుతానని చెప్పిన మోడీ అండ్ కో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా వ్యవహరిస్తారో తెలియంది కాదు. మోడీ తీరుపై ఏప ప్రజలు ఇప్పటికే గుర్రుగా ఉన్న వేళ్.. ఎంపీ శివప్రసాద్ తనదైన శైలిలో వేషం వేసి వార్తల్లోకి వచ్చారు. విభజన సమయంలోనూ ఇదే తరహాలో ఎన్ని వేషాలు వేసినా ఎలాంటి పలితాలు లేకపోవటం తెలిసిందే. తాజాగా మరోసారి ఇదే తరహాలో శివప్రసాద్ ఏపీ పరిస్థితిని పేర్కొంటూ వేస్తున్న విచిత్ర వేషాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. అయితే.. ఇవన్నీ విభజన సమయంలో మాదిరి వేషాలుగా మిగిలిపోతాయా? లేక.. ఏపీకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందో చూడాలి.
Tags:    

Similar News