రోజుకో వేషం అందరి కంటే మీడియా దృష్టిని ఎక్కువగా ఆకర్షించే చిత్తూరుఎంపీ శివప్రసాద్ ఈ రోజు మరో వేషం వేశారు. నిరసనల్ని వేషాలతో వ్యక్తం చేసే ఆయన.. ఈ రోజు ప్రధాని మోడీకి ఎంతో ఇష్టమైన వేషం వేశారు. అలా అని ఆయన్ను రోజూ కంటే ఎక్కువగా తిట్టేశారు.
స్వచ్ఛ కార్మికుడి వేషంలో పార్లమెంటు వద్దకు వచ్చిన ఎంపీ శివప్రసాద్.. గాంధీ విగ్రహం వద్ద తన నిరసనను వ్యక్తం చేశారు. నిత్యం స్వచ్ఛ భారత్ అంటూ నీతులు చెప్పే ప్రధాని మోడీ.. పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నారని.. కానీ ఆయన మనసు మాత్రం స్వచ్ఛంగా లేదంటూ మండిపడ్డారు.
ప్రత్యేక హోదా సాధనలో భాగంగా కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న శివప్రసాద్.. ఈ రోజు పారిశుద్ధ్య కార్మికుడి వేషంలో పార్లమెంటుకు వచ్చారు. మోడీ మనసు మొత్తం కుళ్లు.. కుతంత్రాలతో నిండిపోయిందన్నారు. మోడీ తన మనసుకు పట్టిన మకిలిని వదిలించుకోవాలన్నారు. చంద్రబాబు మీద అసూయతోనే.. ఏపీకి అన్యాయం చేస్తున్నారన్న ఆయన.. బాబుతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడిన దాఖలాలు లేవన్నారు. మోడీ తీరుకు నిరసనగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని తాను చేపట్టనని.. పరిసరాల కంటే ముందు మనసు స్వచ్ఛంగా.. నిర్మలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ శివప్రసాద్ కు అనుకూలంగా టీడీపీ నేతలు ఆయన నిరసనకు మద్దతుగా నిలిచారు.