ఒకేసారి 17మంది వలంటీర్లపై వేటేసిన ఎంపీడీవో

Update: 2020-10-05 17:40 GMT
పనిచేయని గ్రామ వలంటీర్లను పోస్ట్ లను ఊస్ట్ చేశాడు ఓ ఎంపీడీవో.. ఈరోజుల్లో ప్రభుత్వం పోస్టుల్లో నిర్లక్ష్యం.. నిర్లిప్తత అనేది సహజంగా జరిగేది.కానీ ఇలాంటివి సహించని ఎంపీడీవో ఏకంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి ఎంపీడీవో ఎస్వీఎస్ ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని 17మంది గ్రామ వలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘వైఎస్ఆర్’ చేయూత పథకంలో అనర్హుల గుర్తింపు విషయంలో విఫలమైనందుకు వలంటీర్లపై వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్న వారు వైఎస్ఆర్ చేయూత పథకానికి అనర్హులు. కానీ దేవరాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అర్హత లేని 21మంది పేర్లను వలంటీర్లు లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. వారికి ప్రభుత్వ డబ్బులను అందించారు.

ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఎంపీడీవో ఏకంగా 17మందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశంలో 9మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Tags:    

Similar News