రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. మిత్రులు ఉండరు. గతంలో అయితే సిద్ధాంతాలు.. లాంటివి ఉండేవి. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో అలాంటివేమీ బతికి బట్టకట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ మడి కట్టుకొని కూర్చున్నా.. వారిని చేతకాని చవటలా.. దద్దమ్మలా చూడటమే తప్పించి.. వారి తీరును అభినందించేవారు కనిపించని పరిస్థితి.
ఇలాంటి పాడు రోజుల్లోనూ పని కట్టుకొని మంచిగా ఉండాల్సిన అవసరం లేదా? అంటే ఉండాలి. కానీ.. నీతులు వల్లించే వారు సైతం అధికారం కావాలా? విలువలు కావాలా? అంటే మొదటి దాని వైపే మొగ్గే పరిస్థితి. ఇలాంటి వారిని జనం ఛీ కొట్టే వరకు ఇలాంటి తీరు కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
మహారాష్ట్ర రాజకీయాల్ని చూసినప్పుడు.. మరి ముఖ్యంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే దుస్థితి చూసినప్పుడు.. ఎలాంటి వ్యక్తి ఎలా అయిపోయారన్న భావన కలుగక మానదు. మరాఠా రాజకీయాల్లో పెద్దపులిగా అభివర్ణించే బాల్ ఠాక్రే రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగిన ఆయనకు ఇటీవల కాలంలో షాకుల మీద షాకులు తప్పట్లేదు. మోడీ అండ్ కో మంత్రాంగంతో సేన ఎమ్మెల్యేలు పలువురు జంప్ కావటం.. ఆ వెంటనే కొత్త ప్రభుత్వం కొలువు తీరటం లాంటివి వరుస పెట్టి జరిగిపోవటం తెలిసిందే.
థమ్కీ ఇచ్చిన ఎమ్మెల్యేల తీరుతో కలత చెందిన ఉద్దవ్ కు తాజాగా మరో షాక్ కాచుకొని కూర్చుందని చెప్పాలి. బీజేపీ - ఎన్డీయే పార్టీలు మద్దతు ఇచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాలంటూ పార్టీ అధినేతకు తాజాగా సేన ఎంపీలు అల్టిమేటం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ నెల 18న జరిగే ఈ ఎన్నికల్లో విపక్షాలు బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఉద్దవ్ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ముంబయిలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఉద్దవ్ కు షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. ముర్ము గిరిజన మహిళ అయినందున ఆమెను బలపర్చాలని.. ఆమెకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
లోక్ సభలో శివసేనకు మొత్తం 18 మంది ఎంపీలు ఉండగా.. సమావేశానికి పదమూడు మంది హాజరయ్యారని తెలుస్తోంది. సమావేశానికి హాజరు కాని వారు సైతం ద్రౌపదికి మద్దతు ఇస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. తమ అల్టిమేటంకు అధినేత సానుకూలంగా స్పందించని పక్షంలో.. ఎమ్మెల్యేల మాదిరే తాము కూడా షిండే గూటికి పోతామని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. పెద్ద పులి కొడుక్కి వచ్చిపడుతున్న కష్టాల్ని చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేమని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. మోడీ స్కెచ్ ఇలానే ఉంటుంది మరీ అంటూ మరికొందరు వ్యాఖ్యానించటం గమనార్హం.