మహీ మళ్లీ నంబర్ వన్.. ఆటలో కాదు.. ఐపీఎల్ ఆదాయంలో

Update: 2020-12-11 06:11 GMT
రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే రెండు నెలలపాటు తమకిష్టమైన క్రికెటర్ల  బ్యాటింగ్,  బౌలింగ్ విన్యాసాలను తిలకించే అవకాశం ఉంటుంది.  రోజూ   పనులు ముగించుకొని ఇంటికొచ్చి సాయంత్రం వేళ  సరదాగా ఐపీఎల్ వీక్షించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బీసీసీఐ కి కూడా  ఐపీఎల్ నిర్వహణ ద్వారా బోలెడంత ఆదాయం వస్తోంది. అందుకే కరోనా  పరిస్థితుల్లోనూ దుబాయ్ వేదికగా ఐపీఎల్ టోర్నీ నిర్వహించింది. ఐపీఎల్ వల్ల బీసీసీఐ బోర్డుకే కాదు ఆటగాళ్లకు కూడా కాసుల వర్షం కురుస్తోంది.

 పెద్ద పెద్ద ఆటగాళ్లు ఐపీఎల్ వార్షికోత్సవం ఫీజుగా భారీ మొత్తంలోనే తీసుకుంటున్నారు. ఇందులో మన దేశంలోని క్రికెటర్లతో పాటు పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. మన క్రికెటర్లలో మహేంద్రసింగ్ ధోని,  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఆడటం ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటివరకు అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ నిలిచాడు.

 ఐపీఎల్ లో ధోని మొదటినుంచి చెన్నై కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో రెండేళ్లపాటు చెన్నై టీం నిషేధానికి గురవడంతో  పూణే తరఫున ఆడాడు.   సూపర్ కింగ్స్ ఎంట్రీ తర్వాత మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ధోని ఐపీఎల్ ఆడటం  ద్వారా ఇప్పటివరకు రూ. 137 కోట్లు ఆర్జించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. ఆ సీజన్లో ధోని రూ. 6 కోట్లు వార్షికోత్సవ ఫీజుగా  పొందాడు. కొన్నేళ్లుగా ధోని వార్షికోత్సవ ఫీజుగా రూ. 15 కోట్లు అందుకుంటూ వస్తున్నాడు. యాడ్స్ తో సంబంధం లేకుండా ఫీజు ద్వారానే ధోని ఈ మొత్తాన్ని సంపాదించాడు. ధోని తర్వాత ఐపీఎల్ లో అత్యధికంగా ఆర్జించిన క్రికెటర్లలో రెండవ స్థానంలో రోహిత్ శర్మ(రూ.131 కోట్లు ), మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ(127) ఉన్నారు.
Tags:    

Similar News