గంటన్నర చర్చతో ముద్రగడ దీక్ష విరమించారు
గత వారం రోజులుగా కిందామీదా పడుతున్న ఏపీ సర్కారు మీద కొండంత భారం దిగినట్లే. కాపుల్ని బీసీల్లోకి చేరుస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మాటేమైందంటూ మాజీ మంత్రి.. కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఏపీలో కొత్త ఉద్రిక్తతకు దారి తీయటమే కాదు.. రాజకీయంగా ఏపీ అధికారపక్షం తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే.
పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ మంత్రులు పలువురు ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో దఫాలుగా చర్చలు జరిపారు. ఒకరి తర్వాత ఒకరుగా ఏపీ మంత్రులు ముద్రగడ ఇంటికి క్యూ కట్టారు. తన ఇంటికి వచ్చిన మంత్రుల్ని సాదరంగా ఆహ్వానించటం.. నవ్వుతూ మాట్లాడటం లాంటివి చూసినప్పుడే.. ముద్రగడ దీక్ష ఇష్యూ ఒక కొలిక్కి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి రాక విషయంలో ముద్రగడ స్పందించిన తీరు.. ఆయన్ను అప్యాయంగా దగ్గరకు తీసుకున్న వైనం
అయినప్పటికి కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు పలువురు ముద్రగడ ఇంటికి వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం.. వారిని పోలీసులు అడ్డుకోవటం లాంటి ఘటనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.
ఇదిలా ఉంటే.. ఏపీ మంత్రుల బృందం ముద్రగడతో దాదాపు గంటన్నర పాటు జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలమై.. ఆయన వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఒప్పుకున్నారు. దీంతో.. దీక్ష సఫలమైనట్లుగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ప్రకటించారు. ముద్రగడతో తాము అన్ని విషయాలు మాట్లాడామని.. ఆయన దీక్ష విరమిస్తున్నట్లుగా టీడీపీ సీనియర్ నేత కళావెంకట్రావును ప్రకటించారు. ముద్రగడకు నిమ్మరసాన్ని ఇచ్చిన అచ్చెన్నాయుడు..కళా వెంకట్రావులు ముద్రగడ చేస్తున్న దీక్షను విరమింపచేశారు. దీంతో.. గత కొద్దిరోజులుగా ఏపీ సర్కారు కంటి మీద కనుకు లేకుండా ఉన్న కాపుల రిజర్వేషన్ల అంశం ప్రస్తుతానికి శుభం కార్డు పడినట్లేనని చెప్పొచ్చు.