నవీన్ పట్నాయక్, జ్యోతిబసు, వైఎస్ఆర్ లా పూజలందుకోవాలే గానీ.. మీ పదవిని మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దని ఏపీ సీఎం జగన్ కు ముద్రగడ లేఖ రాశారు. ఆయన తన లేఖలో పలు సంచలన విషయాలు ప్రస్తావించారు.
కాపుఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభం తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు రాసిన లేఖలో కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. కాపు జాతి సమస్య తీర్చమని ప్రధాని మోడీని కోరాలని విన్నవించారు.
అడిగిన వారికి.. అడగని వారికి దానాలు ఇస్తూ దానకర్ణుడిలా అనుకుంటున్న సీఎం జగన్ తమ జాతి చిరకాల కోరిక అయిన కాపు రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లకు మద్దతిచ్చారని.. అసెంబ్లీలో ప్రస్తావించారని.. ఇప్పుడు సీఎం అయ్యాక మీకు ఎందుకు చేతులు రావడం లేదని ముద్రగడ తన లేఖలో జగన్ ను ప్రశ్నించారు.
మా జాతి సహకారం పొంది గెలిచిన మీరు ఇప్పుడు ఎందుకు మరిచిపోయారని ముద్ర గడ తాజా లేఖలో జగన్ ను ప్రశ్నించారు. నాడు చంద్రబాబు తీరును ఎండగట్టి ఇప్పుడు సీఎం అయ్యాక ఎందుకు పట్టించుకోవడం లేదని నినదించారు. వైఎస్ఆర్ లా మీరు అందరికీ అన్నీ చేసి పూజలందుకోవాలని.. మీ పదవిని మూన్నాళ్ల ముచ్చట చేసుకోవద్దని ముద్రగడ హితవు పలికారు. ప్రధానిని కాపు రిజర్వేషన్లపై మీరు కోరాలని ముద్రగడ డిమాండ్ చేశారు.