ముద్ర‌గ‌డ మ‌రో లేఖ‌.. బాబుకు చుర‌క‌లే చుర‌క‌లు!

Update: 2017-11-15 04:38 GMT
కాపు ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఫైర‌య్యారు. గ‌త కొన్నాళ్లుగా బాబుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ముద్ర‌గ‌డ‌.. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం తాను ఎంత వ‌ర‌కైనా పోరాడ‌తాన‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నిరాహార దీక్ష‌లు, నిర‌స‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న పాద‌యాత్రకు కూడా సిద్ధ‌మ‌య్యారు. అయితే, పాద‌యాత్ర సాగితే.. ప్ర‌భుత్వానికి సెగ‌త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు.. ముద్ర‌గ‌డ‌కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రంగంలోకి పోలీసుల‌ను దింపి.. అనుమ‌తి పేరుతో అడ్డగించారు. దీనికితోడు కాపు మంత్రులు చిన‌రాజ‌ప్ప త‌దిత‌రుల‌తో విమ‌ర్శ‌ల యుద్ధం చేయించారు. అయినా కూడా త‌న పోరును సాగించేందుకు ముద్ర‌గ‌డ సిద్ధ‌మేన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

వ‌చ్చే నెల డిసెంబ‌రులోగా కాపుల‌కు న్యాయం చేయ‌క‌పోతే.. తాను మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌క త‌ప్ప‌ద‌ని ఆయ‌న ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. ఇక‌, తాజాగా రాష్ట్రంలో జ‌రుగుతున్న విష‌యాల‌పైనా ముద్ర‌గ‌డ స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంగ‌ళ‌వారం మ‌రో లేఖ‌ను చంద్ర‌బాబుకు సంధించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. గ‌త 2015లో జ‌రిగిన గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా రాజ‌మండ్రిలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో దాదాపు 30 మంది మృతి చెందిన విష‌యాన్ని ఆయ‌న లేవ‌నెత్తారు. అప్ప‌టి ఘ‌ట‌నకు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై నియ‌మించిన ఏక‌స‌భ్య క‌మిష‌న్ ఎలాంటి నివేదికా ఇవ్వ‌లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు స‌మ‌యం పొడిగించార‌ని అన్నారు.

చంద్ర‌బాబు కేవ‌లం ఉద్దేశ పూర్వ‌కంగా ఇలా చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇక‌, ఇటీవ‌ల కృష్ణా జిల్లాలోని ప‌విత్ర సంగ‌మ ప్రాంతంలో జ‌రిగిన ప‌డ‌వ ప్ర‌మాదం నుంచి బాబు నైస్‌గా త‌ప్పించుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఈ ప్ర‌మాదాన్ని.. బోటు నిర్వాహ‌కుల‌పై తోసేసి.. తాను చేతులు దులుపుకోవ‌డం సిగ్గుచేట‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం స్థాయిలో నిర్ణ‌యాలు తీసుకుంటే అధికారులు అమ‌లు చేస్తార‌ని, కానీ, ప్ర‌భుత్వం నిద్ర‌పోతూ... ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో అధికారుల నెత్తిన ఆ త‌ప్పు రుద్దాల‌ని బాబు చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇలాంటి ప‌రిస్థితి ఏరాష్ట్రంలోనూ ఉండ‌ద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ‘ గోదావరి పుష్కరాల్లో 30మందిని బలిగొన్నారు. ఇప్పుడు కృష్ణానదిలో పడవ బోల్తా ఘటనలో మరో 22మందిని బలి తీసుకున్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వమే బాధ్యత వహించాలి.  నా పాదయాత్రను అడ్డుకునేందుకు కాపలా పెట్టిన పోలీసులను అటువంటి ప్రదేశాల్లో పెడితే అమాయకులను కాపాడవచ్చు.’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాగా, ముద్ర‌గ‌డ తాజా లేఖ మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రి బాబు దీనిపై స్పందిస్తారో?  లేదో?  చూడాలి.
Tags:    

Similar News