ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు. బలమైన వ్యక్తిత్వం కలిగిన నేత. ఆయన చిత్తశుద్ధి, కమిట్మెంట్ గురించి కూడా అంతా గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఆయన ఇపుడు కాపు ఉద్యమం నుంచి దూరం జరిగారు. రాజకీయాల్లోకి మళ్ళీ వస్తారో లేదో తెలియదు. కానీ ఆయన వైసీపీకి ప్రత్యేకించి జగన్ కి మంచి సలహా సూచనలు చేస్తూంటారు. నాడు చంద్రబాబు సర్కార్ కి సింహస్వప్నం గా నిలిచిన ముద్రగడ జగన్ విషయంలో మాత్రం సాఫ్ట్ కార్నర్ తో ఉంటారన్నది ఆయన మీద ఆరోపణ.
సరే ముద్రగడ తాను అందరి పట్ల ఒకే తీరున ఉంటానని చెప్పినా ఆయన బాబు మీద అయితే ఒంటి కాలి మీద లేస్తారు. ఇది నిజం. ఇక ముద్రగడ జగన్ అధికారంలోకి వచ్చాక వరసబెట్టి లేఖలు మాత్రమే రాస్తూ వస్తున్నారు.
అవి కూడా ప్రజలకు సంబంధించిన అంశాలే కావడం విశేషం. మరి ఆయన లేఖలను జగన్ పాజిటివ్ గా తీసుకుని ఎంతవరకూ పరిష్కరించారూ అన్నది తెలియదు కానీ ముద్రగడ లేఖాయణం మాత్రం ఎక్కడా ఆగడంలేదు.
లేటెస్ట్ గా మరో మారు ముద్రగడ రాసిన లేఖలో కోనసీమకు దివంగత స్పీకర్ బాలయోగి పేరు పెట్టాలని సూచించారు. బాలయోగి కోనసీమ ప్రగతికి ఎంతో మేలు చేశారని, ఆయన ప్రజా ప్రతినిధిగా చేసిన సేవల వల్లనే ఈ రోజు కోనసీమ అభివృద్ధి చెందిందని కూడా గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పేరును జిల్లాకు పెట్టడం మంచి పరిణామంగా చెప్పుకొచ్చారు.
అలాగే గోదావరి జిల్లాలో మరో దానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. బాగా సాహెబ్ పేరిట జిల్లా ఉండడం దార్శనికతను తెలియచేస్తుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి తాను చెప్పినట్లుగా చేస్తే జగన్ చరిత్రలో నిలిచిపోతారని కూడా ముద్రగడ పేర్కొన్నారు. పెద్ద మనసుతో ఆలోచించాలని కూడా సూచించడం విశేషం. మరి ముద్రగడ పట్ల జగన్ కి కూడా సాఫ్ట్ కార్నర్ ఉందని అంటారు. మరి ఆయన ఈ సలహా సూచనలను స్వీకరిస్తారా. ఏమో చూడాలి.