పవన్ కు ముద్రగడ ముప్పై ప్రశ్నలు!

Update: 2023-06-23 13:10 GMT
పవన్‌ కల్యాణ్‌ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ విడుదల చేశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో "మీ అభిమానులతో నన్ను బండ బూతులు తిట్టిస్తున్నారు, మెస్సేజ్‌ లు పెట్టిస్తున్నారు.. మీ మెస్సేజ్‌లకు లొంగిపోయే వ్యక్తిని కాదు, అది ఈ జన్మలో జరగదు" అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కు సుమారు 30 ప్రశ్నలు సూటిగా సంధించారు.

అవును... తాజాగా ముద్రగడ పద్మనాభం మరో ఘాటైన లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో కీలక విషయాలు ప్రస్తావిస్తూ.. పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఈ ప్రశ్నలకు ఎగువన... "నేను ఈ దిగువ రాసిన కొన్ని విషయాలకు సమాధానం మీరు చెప్పాలో వద్దో నిర్ణయం మీకే వదిలిపెడుతున్నారు. ఇంకా చాలా విషయాలు ఈ ఉత్తరంలో రాస్తే మహాభారతం అవుతుందని రాయడం లేదండి" అని సూచించారు.

ఈ సందర్భంగా ముద్రగడ సంధించిన ఆ ముప్పై ప్రశ్నలు ఏమిటనేవి ఇప్పుడు చూద్దాం...

· మొదటి లేఖ అనంతరం మీరు, మీ అభిమానులు నన్ను ఎందుకు బూతులు తిడుతున్నారు?

· మీవద్ద నేనేమీ నౌకరీ చేయడం లేదే?

· నాకు ఏ రకంగానూ సొంత అభిప్రాయాలు ఉండకుండా.. తొత్తుగా ఉండాలా?

· అసలు మీకూ నాకూ సంబంధం ఏమిటి?

· 1988లో వంగవీటి రంగా హత్య అనంతరం అరెస్టై జైలులో ఉన్న అమాయకులను పరామర్శించారా?

· ఈ సందర్భగా జైల్లో ఉన్న వారి కుటుంబాలను ఎనాడైనా కలిశారా?.. వారికి ధైర్యం చెప్పడానికి ఏనాడైనా ప్రయత్నించారా?

· అలా జైల్లో మగ్గిపోయిన అమాయకులకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించారా?

· 1988 - 89లో 3500 మంది అమాయకులపై పెట్టిన కేసులు తీసివేయమని ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని కలిసి కోరారా?

· 1993 - 94లో రావులపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి సభలో కాపులను గొడ్డును బాదినట్లు బాదితే బాదితులను ఏరోజైనా పలకరించారా?

· 1993 -94లో ఉద్యమ సందర్భంగా పెట్టిన కేసులను తీసివేయమని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడిగారా?

· 2016 తుని ఘటన బాదితులను పలకరించారా.. పరామర్శించారా?

· గౌరవ కాపుమంత్రుల కోరికపై తుని ఘటన కేసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎత్తేసినట్లు మీకు తెలియదా?

· కాపు కులాన్ని నేను స్వార్ధం కోసం వాడుకుంటున్నానా?

· గోచీ, మొలతాడు లేనివాళ్లతో తిట్టించడం మగతనం కాదు. ధమ్మూ ధైర్యం ఉంటే మీరు తిట్టండి. మీరు ఏనాడైనా కాపుల గురించి ఆలోచించిన సందర్భం ఉందా?

· అసలు కాపుల గురించి, కాపు నాయకుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా?

· డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసిన సమయంలో కాపులపై పెట్టిన కేసులు తమరికి తెలియవా?

· ఆ సందర్భంలో నిత్యం మిమ్మల్నే తరించేవారికోసం కోనసీమకు తమరు ఎందుకు వెళ్లలేదు?

· కోనసీమ ఘటనలో కేసుల్లో ఉన్న వారి ఎందుకు పరామర్శించలేదు?

· కేవలం తమరికోసం అందరూ రోడ్లమీదకు రావాలా? అలా వచ్చినవారు ఆపదలో ఉంటే మాత్రం మీరు చేతనైన సాయం చేయరా?

· మీ సినిమాల విడుదల సమయంలో ఫ్లెక్సీలకు, స్వీట్లకు, అమ్ముడుపోని టిక్కెట్లకు... ఫ్యాన్స్ కి వేలాది రూపాయల ఖర్చు ఎందుకు?

· కాపులకోసం ఉద్యమిస్తున్న సమయంలో నన్ను పోలీసులు బూటు కాలితో తన్నినప్పుడు మీరెక్కడున్నారు?

· వారాహి యాత్ర ప్రత్తిపాడు నుంచి ప్రారంభమైనప్పుడు నేను వచ్చి మీ బాంచెన్ దొర అనలేదని నన్ను తిడుతున్నారా?

· నా కుటుంబంలో మహిళలను బూతులు తిడుతున్నప్పుడు మీరు ఏమైపోయారు?

· కాకినాడ ఎమ్మెల్యేతో కలిపి నన్నెందుకు తిట్టారు? తిడితే నేనెందుకు పడాలి?

· కాకినాడ ఎమ్మెల్యే కోరినట్లుగా... కాకినాడ నుంచి పోటీచేసే ధైర్యం మీకుందా?

· పోనీ కాకినాడ వద్దనుకుంటే పిఠాపురం నుంచి పోటీచేస్తారా?

· ఈ సందర్భంలో నన్ను మీపై పోటీకి రమ్మని సవాల్ విసరగలరా?

· మీవాళ్లతో తిట్టించి నన్ను ఎన్నికల బరిలోకి దిగి యుద్దానికి సన్నందం కవాలని సూచిస్తున్నారా?

అంటూ... పవన్ కల్యాణ్ పై ముప్పై ప్రశ్నలు సంధించారు ముద్రగడ. ఈ సందర్భంగా... చేగువేరా మీకు ఆదర్శం అని చెప్పుకుంటారు.. గుండెల నిండా ధైర్యం ఉందని అంటారు.. కాబట్టి కాకినాడ, పిఠాపురంలలో ఎక్కడో ఒకచోట నుంచి మీరు పోటిచేయాలనే కోరిక్కల్లో ఏదో ఒక కోరిక తప్పకుండా తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని నేను భావిస్తాను అంటూ ముగించడం గమనార్హం.

మరి ఈ ప్రశ్నల వర్షంపై పవన్ స్పందిస్తారా.. లేదా.. అన్నది వేచి చూడాలి. 

Similar News