కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తన ప్లాన్ `బీ`ని అమల్లో పెట్టినట్లు కనిపిస్తోంది. కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతూనే ఇతర అంశాలపైనా తాను గళం విప్పుతానని ముద్రగడ ఇదివరలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో సంచలనం రేకెత్తిస్తున్న గరగపర్రు ఘటనపై ముద్రగడ కీలక ముందడుగు వేశారు. స్వయంగా అక్కడ పర్యటించిన గరగపర్రు గ్రామంలోని సాంఘిక బహిష్కరణ జరిగిన ప్రాంతంలోని వారిని ముద్రగడ కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు జరిగిన అన్యాయంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇంత దారుణం తాము ఎప్పుడూ చూడలేదని, కావాలనే ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తోందని వారు తెలిపారు. సర్కారు తమ పట్ల వివక్షత చూపుతోందన్నారు. గ్రామంలో 13 కులాలన్నీ ఒక్కటయ్యాయని, వారంతా కలిసి ఎస్సీలను సాంఘిక బహిష్కరణ చేశారని బాధితులు తెలిపారు. దళితులను బహిష్కరణకు గురి చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని వాపోయారు.
దళితుల సమస్యలను తెలుసుకున్న ముద్రగడ పద్మనాభం ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపు జాతిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అదే విధంగా వివక్షత కోణంలో చూస్తున్నారని తెలిపారు. కనీసం జాలి, దయ అనేవి చంద్రబాబుకు లేవని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఈ సాంఘిక బహిష్కరణ సరైనది కాదని, దళితులకు అండగా తాను మద్దతుగా ఉంటానని ముద్రగడ అన్నారు. సత్వరం న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తానని చెప్పారు. స్పందన వచ్చే వరకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/