అమరావతి శంకుస్థాన ముహుర్తం పెట్టేశారు

Update: 2015-10-01 13:19 GMT
ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న ఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్థాపనకు ముహుర్తం నిర్ణయించారు. దసరా పర్వదినాన శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.

శంకుస్థాపన ఎక్కడ చేయాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికి.. తాజాగా ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూమిపూజ చేపట్టిన ప్రాంతంలోనే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని ఏపీ సర్కారు నిర్ణయించినట్లు చెబుతున్నారు. మందడం.. ఉద్ధండరాయపాలెం మధ్యన అక్టోబరు 22 మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇప్పటివరకూ శంకుస్థాపన ముహుర్తం.. ఏ ప్రాంతం అన్న సందేహాలున్నప్పటికీ.. తాజాగా నిర్ణయం తీసుకోవటంతో పనులు చకచకా జరగటమే మిగిలిందని చెప్పొచ్చు.
Tags:    

Similar News