అప్పుచేసిన అంబానీ.. ఎంత‌? ఎందుకు?

Update: 2023-04-06 09:27 GMT
భార‌త దేశ సంప‌న్నుల్లో తొలి ప్లేస్‌లో ఉన్న రిల‌య‌న్స్ దిగ్గ‌జం.. ముఖేష్ అంబానీ.. తాజాగా అప్పు చేశారు. అది కూడా ఏకంగా 4000 కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ మొత్తాన్ని ఆయ‌న విదేశాల నుంచి సేక‌రించ‌డం గ‌మ‌నార్హం. రిలయన్స్, దాని అనుబంధ సంస్థ జియో కలిసి 5 బిలియన్ డాలర్ల(1 బిల‌య‌న్ 100 కోట్లు+ఒక డాల‌ర్ రూ.80 చొప్పున‌=4000 కోట్లు) విదేశీ రుణాలను సేకరించాయి. ఇది భారత దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద సిండికేట్ రుణమని వ్యాపార వర్గాలు తెలిపాయి.

దేశంలో 5జీని వేగంగా విస్తరించాల‌ని ముఖేష్ అంబానీ ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న భారీగా నిధులను ఖర్చు చేస్తున్నారు.  గత సంవత్సరం మూలధన వ్యయం అవసరాల కోసం దాదాపు 750 మిలియన్ డాలర్ల ఐదేళ్ల న్యూ-మనీ క్లబ్ రుణాన్ని పొందింది. తాజాగా కంపెనీ సమీకరించిన నిధులను జియో నెట్ వర్క్ విస్తరణకు, రిటైల్ వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వినియోగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

రిలయన్స్ గత వారం 55 బ్యాంకుల నుంచి 3 బిలియన్ డాలర్లు సేకరించింది. అయితే.. ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచారు. ఇప్పుడు తాజాగా జియో 18 బ్యాంకుల నుంచి మరో 2 బిలియన్ డాలర్ల అదనపు రుణాన్ని పొందింది. జియో తీసుకున్న రుణాన్ని దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ను అభివద్ధి చేసేందుకు ఉపయోగించనుంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సేకరించిన 3 బిలియన్ డాలర్ల నిధులను మూలధన వ్యయం కోసం ఖర్చు చేయనున్నారు.

3 బిలియన్ డాలర్లు రుణం ఇచ్చింది ఎవ‌రంటే..

+ బ్యాంక్ ఆఫ్ అమెరికా

+ హెచ్ఎస్బీసీ

+ ఎమ్యూఎఫ్జీ

+ సిటీ

+ ఎస్బీసీ

+ ఎస్ఎంబీసీ

+ మిజుహో

+ క్రెడిట్ అగ్రికోల్




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News