రిలయన్స్ జియో... ఇటీవల దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ యూజర్లను ఊరిస్తోంది. ఇదే సమయంలో ఇతర నెట్ వర్క్ ప్రొవైడర్లను టెన్షన్ పెడుతోంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో జియో దూసుకుపోతోంది. ఇటీవలే రిలయన్స్ కుటుంబంలో చేరిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్తు గురించి ముఖేష్ అంబానీ మాట్లాడారు. 42వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మొబైల్ వినియోగదారులపై వరాలు కురిపించారు.
ఇతర దేశాల్లో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ధరలకే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాం అని ముఖేష్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి జియో అంకితం చేస్తున్నట్టు ముఖేష్ వివరించారు. ఇక, వినియోగదారులపై పెద్ద ఎత్తున వరాలు కురిపించారు. జియో నెట్ వర్క్ ద్వారా ఇతర నెట్ వర్క్‌లు దేనికైనా ఉచితంగా రోమింగ్ తోపాటు వాయిస్ కాల్స్ సౌకర్యం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఈ కనెక్షన్ కావాలనుకున్నవారు ఆధార్ కార్డు జెరాక్స్ సమర్పిస్తే 15 నిమిషాల్లో సిమ్ ఇచ్చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 5వ తేదీ నుంచి జియో సేవల్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అడిషన్ మొబైల్ డాటా అందించబోతున్నట్టు చెప్పారు. స్టూడెంట్ ఐడీ కార్డు ఉన్నవారికి అదనంగా 50 శాతం డాటా అందించబోతున్నారు. రూ. 50కే ఒక జీబీ డాటా అందించబోతున్నారు. ఇక, పండుగ రోజుల్లో మెసేస్ లు బ్లాకింగ్ వంటివి ఉండవు. 300 ఛానల్స్ లైవ్ లో చూసుకోవచ్చు. లక్షల కొద్దీ కాలర్ ట్యూన్స్ - ఆరు వేల సినిమాలు ఉచితం - 60 వేల సంగీత వీడియోలు ఉచితం - ఇక మొబైల్ అప్లికేషన్స్ ప్రత్యేకం... ఇలా వినియోగదారులపై ఎన్నో రకాల వరాలు కురిపిస్తున్నారు ముఖేష్ అంబానీ. వచ్చే ఏడాది నాటికి 90 శాతం గ్రామాలకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.