జియో ఆఫ‌ర్ః మార్చి 31 వ‌ర‌కు ఫ్రీ

Update: 2016-12-01 09:19 GMT
రిలయెన్స్ జియో అధినేత ముఖేష్‌ అంబానీ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. మార్చి 31 వ‌ర‌కు జియోను ఉచితంగా వాడుకోవ‌చ్చున‌ని తాజా ప్ర‌క‌టించారు. ఇవాళ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ . డిసెంబర్‌ 31నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సిమ్‌ సౌలభ్యం కలుగజేస్తామన్నారు. 2017 మార్చి 31 వరకూ ఫ్రీ డేటా సర్వీస్‌ అందిస్తామన్నారు. అత్యంత సాంకేతికతను అందించే సంస్థ జియో అని పేర్కొంటూ జియో విజయం తమ ఖాతాదారులదేనని అన్నారు. జియోతో ప్రతీరోజు 6 లక్షల మంది వినియోగదారులు అనుసంధానం కావడం సంతోషమని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఇతర నెట్ వర్క్‌లతో పోల్చితే జియో 25 రెట్లు అధిక వేగమని తెలిపారు. తమను నమ్మిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు లాంచింగ్ ఆఫర్ ఇచ్చామన్నారు.

జియో అత్యంత వేగంగా 5 కోట్ల వినియోగదారులన సంఖ్యను అధిగమించిందని ముఖేష్ అంబానీ అన్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, స్కైప్‌లకంటే వేగంగా జియో అభివృద్ధి ఉందని అన్నారు. అత్యంత వేగంగా సాంకేతికను అందించే సంస్థ జియో అని ఆయన చెప్పారు. సలహాలు, సూచనల కోసమే లాంచింగ్‌ ఆఫర్‌ ఇచ్చామని ముఖేష్ అంబానీ చెప్పారు. కాగిత రహిత సమాజం కోసం జియోను తీసుకువచ్చామని ఆయన అన్నారు. జియో వినియోగదారులకు ఇతర‌ నెట్ వర్క్‌లు సహకరించడంలేదని తెలిపారు. జియో సర్వీసులో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ తీసుకు రమ్మన్నామని చెప్పారు.

ఎంతో ధైర్యంతో ప్రధాని నరేంద్రమోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ముఖేష్ అంబానీ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని పేర్కొన్నారు. ఆర్థిక దిశను మార్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దేశంలో పారదర్శకత పెంచేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధానిని ఆయన అభినందించారు. దేశంలో పారదర్శకత పెంచేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందన్నారు.
Tags:    

Similar News