అంతకంతకూ విస్తరిస్తూ.. దేశంలో తిరుగులేని కార్పొరేట్ దిగ్గజంగా మారుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా ఒక భారీ టార్గెట్ పెట్టుకున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఇప్పటికే పలు సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. వ్యాపార ప్రపంచంలో తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే ఆయన తాజాగా చైనాకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ మీద కన్నేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ సంస్థ ఏమిటి? అదేం తయారు చేస్తోంది? ఆ కంపెనీ మీద ముకేశ్ అంబానీ టార్గెట్ పెట్టుకోవటానికి కారణం ఏమిటన్న విషయాల్లోకి వెళితే..
చైనా నేషనల్ కెమికట్ కార్పొరేషన్.. పొట్టిగా పిలవాలంటే ‘కెమ్ చైనా’గా పిలుస్తారు. సోలార్ ప్యానెల్స్ తయారీలో తిరుగులేని ఈ సంస్థను సొంతం చేసుకోవటంపై రిలయన్స్ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఈ డీల్ విలువ సుమారు 1-1.2 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని చెబుతున్నారు. ఈ డీల్ ను పూర్తి చేయటానికి దాదాపు 500-600 మిలియన్ డాలర్లను అప్పు రూపంలో సమకూర్చుకోవటానికి అంతర్జాతీయ బ్యాంకులతో ముకేశ్ అంబానీ కంపెనీలు చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.
పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి రంగంలో విస్తరించాలని భావిస్తున్న రియలన్స్ ఈ డీల్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ డీల్ పూర్తిఅయితే అధునాతన టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యాలు కూడా కంపెనీకి సొంతమవుతాయని చెబుతున్నారు. సౌర విద్యుత్ పరిశ్రమ ఇప్పుడు ఎక్కువగా చైనా మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి వేళ.. తాజా డీల్ ఓకే అయితే.. సోలార్ పవర్ విషయంలో మరో పెద్ద అడుగు పడినట్లే అవుతుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు ఈ రంగానికి సంబంధించి 90 శాతం ఉత్పత్తుల్ని చైనా నుంచి చైనీస్ కంపెనీల నుంచే దిగుమతి చేసుకునే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు అలాంటి కంపెనీల్లో ముఖ్యమైనది సొంతమైతే.. దేశీయంగా ఈ రంగంలో తిరుగులేని శక్తిగా అవతరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.