అంబానీ మార్క్..జియో కోసం మ‌రో 70వేల కోట్లు

Update: 2017-01-16 10:43 GMT
రిల‌య‌న్స్ జియో పేరుతో టెలికాం కంపెనీల దిమ్మ‌తిరిగేలా చేసిన ముఖేశ్ అంబానీ 4జీలో త‌న‌కు ప్ర‌త్య‌ర్థులే లేకుండా చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్ప‌టికే జియోపై రూ.ల‌క్షా 70 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టిన అంబానీ.. మ‌రో రూ.30 వేల కోట్లు స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హ‌క్కుల‌ను క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా ఈ నిధులు స‌మ‌కూర్చుకోవాల‌ని భావిస్తున్న రిల‌యెన్స్‌.. వాటిని జియో నెట్‌ వ‌ర్క్ సామ‌ర్థ్యం పెంపు కోసం ఉప‌యోగించ‌నుంది. మార్చి 31 వ‌ర‌కు త‌మ యూజ‌ర్ల‌కు అన్‌ లిమిటెడ్ ఫ్రీ వాయిస్ - డేటా అందిస్తున్న జియో.. రోజుకు కొత్త‌గా 6 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్న‌ట్లు చెప్పింది. త‌మ సేవ‌ల‌ను ప్రారంభించి 4 నెల‌లు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు జియో క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 7.24 కోట్ల‌కు చేర‌డం విశేషం.

ఇప్ప‌టికే జియో ధాటికి బెంబేలెత్తుతున్న ప్ర‌త్య‌ర్థి కంపెనీలకు తాజా పెట్టుబ‌డులు మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. అన్నీ ఫ్రీ అంటూ జియో ఇస్తున్న ఆఫ‌ర్ల‌ను భార‌తీ ఎయిర్‌ టెల్ ట్రిబ్యున‌ల్‌ లో స‌వాలు చేసింది. దీనిపై ఫిబ్ర‌వ‌రి 1న విచార‌ణ కూడా జ‌ర‌గ‌నుంది. ప్ర‌త్య‌ర్థి కంపెనీలు అడ్డంకులు సృష్టిస్తున్నా.. జియో మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. అంద‌రిలో ఒక‌టిగా ఉండాల‌ని జియో అనుకోవ‌డం లేదు. నంబ‌ర్‌ వ‌న్‌ గా నిల‌వాలి. కొన‌సాగాలి అని భావిస్తోంది. అలా జ‌ర‌గాలంటే మ‌రిన్ని పెట్టుబ‌డులు అవ‌స‌రం అని బ్లూమ్‌ బ‌ర్గ్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌ ప‌ర్ట్ ఆంథియా లాయ్ అన్నారు. అత్య‌ధిక లాభాలు అందిస్తున్న పెట్రోలియం ఉత్ప‌త్తుల నుంచి మెల్ల‌గా టెలికాం రంగంలోనూ ఆ స్థాయి లాభాల కోసం జియోలో భారీగా పెట్టుబ‌డుల‌కు అంబానీ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ నిధుల స‌మీక‌ర‌ణ‌లో భాగంగా 600 కోట్ల ప‌ది రూపాయ‌ల షేర్ల‌ను 40 రూపాయ‌ల ప్రీమియంకు ఇవ్వాల‌ని భావిస్తోంది. ముఖేశ్ స్కెచ్ ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి మ‌రి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News