నోట్ల రద్దుకు నక్వీ చెప్పిన రెఫరెండం ఇదే!

Update: 2016-12-22 04:41 GMT
నోట్లరద్దు నిర్ణయం వల్ల మోడీపైనా - బీజేపీపైనా ప్రజల్లో అసహనం పెరిగిపోయిందని, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు మోడీ అపరిపక్వత నిర్ణయాలే కారణం అని రకరకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీ నేతలు కూడా గట్టిగా సమర్ధించలేని పరిస్థితి. క్యూలైన్ లో సామాన్యుడు పడుతున్న కష్టాలకు, ఇబ్బందులకు ఫలితం వస్తుందా దేశానికి మంచి జరుగుతుందా లేదా అనే విషయంపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు కూడా. ఈ సమయంలో మోడీ నిర్ణయాన్ని సమర్ధించేవారి శాతం కూడా తగ్గిపోతుందనే కథనాలు వస్తున్నాయి. అయితే నోట్లరద్దు వల్ల ప్రజలు ఇబ్బందులేమీ పడటం లేదని, ప్రజలు మోడీవైపే ఉన్నారని చెప్పడానికి తాజా నిదర్శనం ఇదే అని చూపిస్తున్నారు కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ.

పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు కాస్తో కూస్తో అసౌకర్యానికి గురవుతున్నారే తప్ప ఎవరూ బాదపడటం లేదని, పైగా ప్రజలంతా ఈ విషయంలో మోడీ వెంటే ఉన్నారని చెబుతున్న కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ... దీనికి నిదర్శనంగా ఛండీగఢ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందంటే అర్ధం... నోట్ల రద్దు విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల మద్దతు పూర్తిగా ఉందనేది ఆయన లాజిక్. ఈయన సమర్ధన అలా ఉంటే... దేశవ్యాప్తంగా ప్రజలు పడిన, పడుతున్న ఇబ్బందులకు కేవలం ఛండీగఢ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూపించడం అనేది మోడీస్థాయిని తగ్గించినట్లుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సమస్యలే ప్రధాన అజెండాగా సాగే మున్సిపల్ ఎన్నికలే రెఫరెండం అనడం కంటే... త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలే నేడు మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాలకు రెఫరెండం అని అని ఉంటే మోడీ స్థాయికి బాగుండేది అని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News