కాంగ్రెస్ కొత్త సార‌థిగా ముకుల్ వాస్నిక్‌.. జీ-23 నేత‌ల ప‌ట్టు.. కాద‌న్న గాంధీల కుటుంబం

Update: 2022-03-13 15:54 GMT
మునుపెన్నడూ చవిచూడని వరుస ఓటములు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత ఘోర పరాజయం... గాంధీల కుటుంబమే కాంగ్రె్‌సకు గుదిబండగా మారిందనే విమర్శలు.. వెరసి కాంగ్రె్‌సపార్టీలో ఇప్పుడు పెను తుఫాను చెలరేగింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ జాతీయ సార‌థిగా గాంధీల కుటుంబం వ‌ద్ద‌నే సూచ‌న‌లు కూడా వ‌స్త‌న్నాయి.

ముఖ్యంగా తీవ్ర అస‌మ్మ‌తితో ర‌గిలిపోతున్న జీ-23 నేత‌లు.. కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను గాంధీల కుటుంబం నుంచి త‌ప్పించి.. ముకుల్ వాస్నిక్‌కు అప్ప‌గించాల‌నే ప్ర‌తిపాద‌న చేశారు. అయితే.. గాంధీల కుటుంబం దీనికి నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది.

ఏం జ‌రిగింది?

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదుర్కొంది. ఎక్క‌డా ఐపు, అజ కూడా లేకుండా పోయింది. దీంతో ఒక్క‌సారిగా పార్టీలో ప్ర‌క్షాళ‌న అవ‌స‌ర‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి.  దీనికితోడు .. కొంద‌రు సీనియ‌ర్లు కూడా ప‌క్క చూపులుఉ చూస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఇదే జ‌రిగితే.. కాంగ్రెస్ పూర్తిగా పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌ని పార్టీ అంచ‌నా వేసింది. దీంతో వెనువెంటనే ఆత్మ ప‌రిశీల‌న దిశ‌గా అడుగులు వేసింది. ఈ క్ర‌మంలోనే తాజాగా సీడ‌బ్య్లుసీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశానికి జీ-23 నేత‌ల‌ను కూడా ఆహ్వానించారు.

వాస్నిక్ ప్ర‌తిపాద‌న‌!

ఈ సంద‌ర్భంగా  జీ-23 నేత‌లు నాయకత్వ మార్పు అవసరమని స్పష్టం చేస్తున్నారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీకి ఓ సీనియర్ నేతను అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని భావించారు. ఈ క్ర‌మంలోనే పార్టీ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్ పేరును సూచించినట్లు వార్తలు వచ్చాయి.

పార్టీ చీఫ్ పదవికి వాస్నిక్ పేరును జీ23 నేతలు సూచించినప్పటికీ గాంధీల కుటుంబం అంగీక‌రించ‌లేద‌ని.. ఓ వార్తా సంస్థ వెల్ల‌డించింది.  "ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్‌లతో కూడిన G23, పార్టీ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్ పేరును సూచించింది. కానీ సోనియా ఒప్పుకోలేదు`` అని విశ్వసనీయవర్గాలు తెలిపిన‌ట్టు స‌ద‌రు వార్తా సంస్థ పేర్కొంది.

అప్ప‌ట్లో మాదిరిగా.. ఇప్పుడు జ‌ర‌గ‌దా?

వాస్త‌వానికి  2000 ప్రారంభంలో సోనియా గాంధీ చేసిన విధంగా కొత్త పార్టీ అధ్యక్షులు పార్టీని నడిపించాలని జీ 23 నేతలు అంటున్నారు. ``సోనియా గాంధీ (తాత్కాలిక) అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ, అది కెసి వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాల సార‌థ్యంలోనే అన్నీ జ‌రుగుతున్నాయి.  

వారికి ఎటువంటి జవాబుదారీతనం లేదు, "అని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ "తెర వెనుక నుంచి పనిచేస్తున్నారు" అని తెలిపారు. "రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాదు. కానీ అతను తెర వెనుక నుంచి ఆపరేట్ చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. అతను బహిరంగంగా కమ్యూనికేట్ చేయడు, "అని జీ23 నేతలు తెలిపారు. "మేము పార్టీ శ్రేయోభిలాషులం, శత్రువులం కాదు" అని అన్నారు.  

ఎవ‌రు బాధ్యులు?

ఇటీవ‌ల జ‌రిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. పంజాబ్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరమైన ఫలితాలను చవిచూసింది. కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్ని తానై విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ.. ఆ పార్టీ గెలిచిన అసెంబ్లీ స్థానాల సంఖ్య 2ను మించలేదు. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా.. పంజాబ్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది.

దీంతో కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి ఎవ‌రిని బాధ్యుల‌ను చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. సీడ‌బ్ల్యుసీ మీటింగ్ త‌ర్వాత‌.. ఎలాంటి నిర్ణ‌యం వ‌స్తుందో అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.
Tags:    

Similar News