అతనో బిలియనీర్ కొడుకు. అతడి కుటుంబానికి పెద్ద కన్ స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. కానీ చెడు అలవాట్లతో దారి తప్పాడు. మాదక ద్రవ్యాలకు బానిస అయ్యాడు. వాటి కోసం అడ్డదారులు తొక్కాడు. చివరికి దొంగ నోట్లు ముద్రించే స్థాయికి దిగజారిపోయాడు. ఐతే పోలీసులు నాకాబందీ నిర్వహిస్తుండగా అనుకోకుండా అతడి గుట్టంతా బయటపడింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం పదండి.
ఇటీవలే ముంబయి పోలీసులు నగరంలో వడి బందర్ బ్రిడ్జ్ మీద నాకాబందీ నిర్వహిస్తుండగా.. ఒక టూవీలర్ రైడర్ వాళ్లను దాటుకుని వేగంగా దూసుకెళ్లింది. పోలీసులు ఆపమన్నా ఆపలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి అతణ్ని ఆపారు. ఆ బైక్ మీద అన్సారి అనే 21 ఏళ్ల కుర్రాడున్నాడు. అతణ్ని పట్టుకుని సోదా చేస్తే 47 వేల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లున్నాయి. వాటి సోర్స్ గురించి అడిగితే తడబడ్డాడు. దీంతో పోలీసులు ఆ నోట్లను పరిశీలించి చూడగా అవి దొంగనోట్లని తేలింది.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఈ దొంగ నోట్ల వెనుక ఉన్నది ఎవరో వెల్లడైంది. సల్మాన్ సోపరివాలా అనే 28 ఏళ్ల కుర్రాడు ఈ దొంగనోట్లను ముద్రిస్తున్నట్లు వెల్లడైంది. అతనో బిలియనీర్ కొడుకు. బాగా చదువుకున్నాడు. ఒకట్రెండు ఉద్యోగాలు కూడా చేశాడు. ఈ సమయంలోనే అతను డ్రగ్స్ కు బానిస అయ్యాడు. వాటి కోసం కుటుంబ సభ్యులెవరూ డబ్బులు ఇవ్వకపోవడంతో సల్మాన్.. ఏం చేయాలా అని ఆలోచించాడు. దొంగనోట్ల ముద్రణ మొదలుపెట్టాడు. వాటితోనే కొంత కాలంగా డ్రగ్స్ కొంటున్నాడతను. పోలీసులు అతనుండే గదిలో దొంగ నోట్ల ముద్రణకు ఉపయోగించే సామగ్రి మొత్తం స్వాధీనం చేసుకున్నారు. సల్మాన్ గుట్టు బయటపడే సమయానికి అతను అమెరికాలో ఉండటం గమనార్హం. అక్కడి నుంచి వచ్చాక అతడిని అరెస్టు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/