పెళ్లి చేసుకుంటానంటూ ఓ నటిపై అత్యాచారం చేసిన ఫిట్నెస్ ట్రైనర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆదిత్య అజయ్ కపూర్ గా గుర్తించారు. కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన 24 ఏళ్ల నటిని సబర్బన్ బాంద్రాలోని ఒక సాధారణ స్నేహితుని నివాసంలో అతడు అత్యాచారం చేశాడు. కఫ్ పరేడ్‌లోని తన నివాసంలోనూ, గోవాలోనూ తనపై అత్యాచారం చేశాడని నటి తెలిపింది.
ఆదిత్య అజయ్ కపూర్ తో తొలుత పరిచయం ఏర్పడిందని.. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని టచ్‌లో ఉన్నామని... కాలక్రమేణా వారు ఒకరికొకరు సన్నిహితంగా మారారని అధికారి తెలిపారు. " తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడని.. శారీరక సంబంధాలు కొనసాగించాడని.. అనంతరం వదిలేశాడని" సదురు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదిత్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అధికారి తెలిపారు. ఆదిత్య కపూర్ కాఫీ పరేడ్ ప్రాంతంలోని తన నివాసంతోపాటు.. గోవాలో కూడా తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు.
‘‘పెళ్లి చేసుకోవాలని నటి అడిగితే.. తనతో శారీరక సంబంధాలు కొనసాగించాలని పట్టుబట్టాడని.. తాను నిరాకరించడంతో దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడని నటి ఆరోపించింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు అసభ్యకరమైన సందేశాలు పంపి చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది.. వేధింపులతో విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
అత్యాచారం ఆరోపణలపై మొదట ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తరువాత నేరం జరిగిన కఫ్ పరేడ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆదిత్య కపూర్‌ను భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద అత్యాచారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.