ఈ చిరు వ్యాపారి గుండె 1300కిలోమీట‌ర్లు దాటింది

Update: 2017-10-13 17:12 GMT
తోటి మ‌నిషికి స‌హాయం చేయాల‌నుకుంటే...దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. డ‌బ్బులు ఉండ‌టం..ఖాళీ స‌మ‌యం దొర‌క‌డం...వంటివే కాదు...ప్రాణాల‌తో ఉండ‌టం కూడా! అయితే ప్రాణాల‌తో లేక‌పోయిన‌ప్ప‌టికీ...మ‌నిషి తాను అనుకున్న స‌హాయం చేయ‌గ‌ల‌డు. అదెలా అంటే...అవ‌య‌వ‌దానం. అలా అవ‌య‌వ‌దానం చేసిన ఓ  చిరు వ్యాపారి ఉదంతం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మాన‌వ‌త హృద‌యం క‌లిగిన వారిని త‌ట్టిలేపుతోంది.

ఈ ఉదంతం గుండె మార్పిడికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం మాత్ర‌మే కాదు...రెండు మెట్రోన‌గ‌రాల మ‌ధ్య సుమారు 1300 కిలోమీట‌ర్లు ఆ గుండె ప్ర‌యాణించి మ‌రొక‌రికి ప్రాణం పోసిన విధానం కూడా. న‌వీముంభైకి చెందిన చేత‌న్ టేలర్ అనే వ్య‌క్తి ఓ చిరు వ్యాపారి. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆయ‌న తీవ్ర అనారోగ్యం పాలై 20 రోజుల కిందట ఆస్ప‌త్రి పాల‌య్యాడు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు తేలింది. దీంతో...ఆయ‌న స్థితిని గ‌మ‌నించిన వైద్యులు....అవ‌య‌వ‌దానం గురించి కుటుంబ స‌భ్యుల‌కు వివ‌రించారు. గుండెను దానం చేసేందుకు ఒప్పించారు. ఇదే స‌మ‌యంలో లెబ‌నాన్‌కు చెందిన ఓ వ్య‌క్తికి గుండె అవ‌స‌రం ప‌డి చెన్నై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వార్త అపోలో ఆస్ప‌త్రి య‌జ‌మాన్యం గుర్తించింది.

దీంతో చేత‌న్ టేల‌ర్ గుండె త‌ర‌లింపు ప్రక్రియ మొద‌లైంది. ముంబై ఆసుపత్రి నుంచి చెన్నై ఆస్ప‌త్రికి గుండెను తరలించేందుకు వారు ప్ర‌భుత్వ  అధికారుల స‌హాయం తీసుకున్నారు. గుండెను స‌కాలంలో త‌ర‌లించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించ‌డంతో ట్రాఫిక్ అధికారులు స్పందించి ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ ను నియంత్రించారు. దీంతో న‌వీ ముంబై కేవలం 40 నిమిషాల్లో గుండెను ముంబై ఎయిర్ పోర్ట్‌ కు చేర్చారు. అప్ప‌టికే అక్క‌డ సిద్ధంగా ఉన్న విమానంలో చెన్నైలోని ఫోర్టిస్‌ ఆస్పత్రికి త‌ర‌లించారు. ఇదంతా కేవ‌లం నాలుగు గంట‌ల్లో పూర్త‌యింది. అనంత‌రం విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసిన‌ట్లు వైద్యులు వివ‌రించారు.
Tags:    

Similar News