ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఆత్మాహుతితో ఆత్మహత్యాయత్నం చేసిన మునికోటి ఆరోగ్యం విషమంగా ఉందని చెబుతున్నారు. 70శాతానికి పైగా కాలిన గాయాలతో నరకం అనుభవిస్తున్న మునికోటి.. ప్రస్తుతం వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ.. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మునికోటికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. మూడు రోజుల ముందు.. తానో సంచలనం సృష్టించనున్నట్లుగా తన సన్నిహితులకు చెప్పాడని చెబుతున్నారు. అయితే.. ఇంత పని చేస్తాడని తామెవరం ఊహించలేదని.. మునికోటి సన్నిహితులు చెబుతన్నారు.
తాను ఆత్మహత్యాయత్నం.. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే చేసినట్లుగా మునికోటి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. భార్య నుంచి విడిపోయి..విడిగా ఉంటున్న మునికోటి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెబుతున్నారు. ఇతని ఆరోగ్య పరిస్థితి పై కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ వాకబు చేయగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ విపక్ష నేత జగన్ తదితరులు మునికోటి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు.