ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్ స్థానాలకు, 71 నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలి తాలు మరో 24 గంటల్లో వెల్లడి కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే.. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నప్ప టికీ మూడు కీలక కార్పొరేషన్లపైనే ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టీ ఉంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇతర పార్టీలు కూడా ఈమూడు స్తానాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిం చాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు విజయం సాధిస్తారు? అనే అంశాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
వీటిలో విజయవాడ, గుంటూరు, విశాఖ కార్పొరేషన్లు ఉన్నాయి. గత 2014 ఎన్నికల్లో ఈ మూడు కార్పొరేష న్లను టీడీపీ కైవసం చేసుకుంది. అయితే, రాష్ట్రంలో ఇప్పుడు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఈ మూడు చోట్లా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉండడం గమనార్హం. అంతేకాదు..ఈ మూడు కార్పొరేషన్లను గెలుచుకుంటే.. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానులు సహా ఇంగ్లీష్ బోధనకు సంబంధించిన నిర్ణయానికి ప్రజలు ఆమోద ముద్ర వేసినట్టుగా భావిస్తున్నారు. దీంతో ఇక్కడ గెలిచి తీరాలని వైసీపీ నాయకులు నిర్ణయించుకుని.. ఆదిశగానే అడుగులు వేశారు. కీలక మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వైసీపీలో ఈ మూడు చోట్లా గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఈ మూడు కార్పొరేషన్లలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కీలకమైన, ఆర్థికంగా, సెంటిమెంటు పరంగా బలంగా ఉన్న నాయకులకు ఇక్కడ అవకాశం కల్పించింది. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం ద్వారా.. అధికార పార్టీ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు జై కొట్టడం లేదనే వాదనను బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే.. టీడీపీలో అంతర్గత పోరు.. కలిసిరాని నాయకత్వం.. కీలకనేతల మౌనం.. వంటివి వెండాతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆశలు ఏమేరకు ఇక్కడ సఫలీ కృతం అవుతాయనేదానిపై పార్టీలో ఉత్కంఠ నెలకొనడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు గెలిచినా.. ఓడినా.. పరిస్థితి వేరేగా ఉంటుందని.. ఈ మూడు చోట్ల గెలుపునే అధికార, ప్రతిపక్షాలు ప్రజాతీర్పుగా పరిగణించే అవకాశం ఉందని అంటున్నారు.