తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరిపాలనలో విమర్శల్లోనే కాదు....సమస్యల్లోనూ పోటీపడుతున్నట్లుగా ఉన్నాయి. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణలోని మున్సిపల్ కార్మికులు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరాలన్నీ చెత్తమయం అయిపోయాయి. ఎక్కడ వేసిన చెత్త అక్కడే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అయితే వీరి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కారు తన వంతు ప్రయత్నం మొదలుపెట్టింది.
మరోవైపు ఏపీలోనూ ఇదే సమస్య షురూ అయింది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ.. ఏపీలోని మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తున్నారు. తమకు పీఆర్‌సీ అమలుచేయాలని, న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు.
మరో ముఖ్య అంశం ఏమంటే...తెలంగాణలో మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉండగా..ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు దగ్గరైన నారాయణ చేతిలో ఉంది. అంటే పరోక్షంగా ఇద్దరు సీఎంలే కీలక నిర్ణయాధికారులు అన్నమాట.