నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాలు తెలుగుదేశం వర్గాలను స్పందించేలా చేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఎంపీలు తమ కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో భూములు కొన్నారనేది ఈ వార్తల సారాంశం. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే పలువురు మంత్రులు వివరణ ఇవ్వగా తాజాగా రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వివరణ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను చాలా కాలం నుంచీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానని ఎలాంటి వివాదం లేని భూములనే తాను కొన్నానని మురళీమోహన్ స్పష్టం చేశారు. బాబు బినామీగా కొందరు పని గట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని పునరుద్ఘాటించారు. చంద్రబాబు నాయుడుతో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు నిరూపిస్తే అసెంబ్లీ ఎదుట ఉరి వేసుకుంటానని గతంలోనే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మురళీమోహన్ గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పీజేఆర్ గతంలో ఇవే ఆరోపణలు చేశారని అయితే వాటిని నిరూపించలేకపోయారని ఈ సందర్భంగా మురళీమోహన్ గుర్తుచేశారు.
నీతి, నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన తాను సినీ రంగంలో అదే విధంగా కొనసాగి రియల్ ఎస్టేట్ రంగంలోనూ అదే రీతిలో ముందుకు నడిచానని చెప్పారు. ఈ రోజు వరకు తప్పులు చేయలేదని పేర్కొంటూ నిజాయితీగా ఉండేవారిని బతకనివ్వరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అవినీతి చేసినట్లే మిగతా వారు కూడా అలాగే తప్పుడు దారిలో నడుస్తారని అనుకోవడం సరికాదని మండిపడ్డారు. తనపై అవాస్తవాలు ప్రచురించే ముందు జగన్ తన గురించి ఆలోచించుకోవాలని మురళీమోహన్ సూచించారు