ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను పూర్తిచేసిన చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి అధ్యక్షుని ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం పూర్తి కావస్తుండడంతో ఆ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. రాజమండ్రి లోక్ సభ సభ్యుడు - సినీనటుడు మురళీమోహన్ - ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు - విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ పేర్లతో పాటు నరసరావుపేట లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మురళీమోహన్ - లక్ష్మీనారాయణ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని, వీరిలో ఒకరికి తితిదే అధ్యక్ష పదవి ఖాయమని తెదేపాలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
పార్టీ నేతలకు తీపి కబురు అందించడంలో భాగంగా నామినేటెడ్ పదవుల ఎంపికతో పాటు తితిదే చైర్మన్ పదవిని కూడా చేపట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుత చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం ముగుస్తుండటంతో ఆయనను ఆ పదవిలో కొనసాగించే అవకాశాలు లేదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు చైర్మన్ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నా అది నెరవేరే అవకాశాలు లేవని చెబుతున్నారు. వివాదారహితులు - ఎటువంటి ఆరోపణలు లేని వారిని తితిదే చైర్మన్ గా ఎంపిక చేయాలని ఇప్పటికే చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆయన అంతరంగికులు చర్చించుకుంటున్నారు. మురళీమోహన్ పార్టీకి వీరవిధేయుడితోపాటు చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ప్రచారం ఉంది. ఆయనకు అమితమైన భక్తిభావం ఉండడంతో పాటు తితిదే చైర్మన్ పదవికి ఆయన అన్ని విధాలా అర్హుడని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ ముఖ్యులతో చంద్రబాబు జరిపిన చర్చల్లో మురళీమోహన్ పేరును ప్రస్తావనకు తీసుకువచ్చినట్టు సమాచారం. దీనిబట్టి చంద్రబాబు మురళీమోహన్ పై అత్యధికంగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. రాయపాటికి ఆయన వ్యాపారాలే సమస్యగా మారిందని అంటున్నారు. ఆయన కంపెనీపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆయన ఎంపికపై పెద్దగా దృష్టి పెట్టలేదని సమాచారం.
తాను ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ప్రత్యేకాధికారిగా సీఎం కార్యాలయంలో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన డాక్టర్ కె.లక్ష్మీనారాయణ పేరును కూడా చంద్రబాబు తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్ళలోనే చంద్ర బాబును మర్యాదపూర్వకంగా లక్ష్మీనారాయణ కలిసిన సమయంలో తితిదే చైర్మన్ పదవిని కట్టబెడతానన్న హామీని అప్పట్లోనే ఇచ్చారని, సామాజిక సమీకరణల నేపథ్యంలో చదలవాడకు అప్పట్లో ఈ పదవిని ఇవ్వాల్సి వచ్చిందని పలు సందర్భాల్లో చంద్రబాబు లక్ష్మీనారాయణతో జరిపిన చర్చల సందర్భంగా పేర్కొన్నట్టు సమాచారం. అనంతరం పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గా లక్ష్మీనారాయణను ఎంపిక చేసినప్పటికీ ఆ పదవిని చేపట్టడానికి ఆయన ససేమిరా అన్నారు. తాజాగా ఆయనను టీటీడీపీ చైర్మన్ గిరీకి ఎంపిక చేస్తారని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/