మర్డర్ కేసు.. మరణ వాంగ్మూలం పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Update: 2022-02-02 05:42 GMT
మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితుడికి శిక్ష విధించవచ్చు అని  దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందుకు ఇతర సాక్ష్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఓ మర్డర్ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన... అలహాబాద్ హైకోర్టు తీర్పుని తోసిపుచ్చింది. ఈ మేరకు ధర్మాసనం పలు మార్గ దర్శకాలు జారీ చేసింది.

ఓ కేసులో మహిళను ఆమె మావ, బావ కలిసి హత్యాయత్నం చేశారని బాధితురాలు మరణ వాంగ్మూలం ఇచ్చింది. వారిద్దరే కారణమంటూ చనిపోయే ముందు మెజిస్ట్రేట్ ఎదుట చెప్పింది. కాగా ఈ మరణ వాంగ్మూలం ఆధారంగా ట్రయల్ కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా దీనిపై అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది.

ఈ కేసులో మరణ వాంగ్మూలాన్ని మద్దతుగా వేరే సాక్ష్యం లేదంటూ అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇతర సాక్ష్యాలు  కావాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. కాగా దీనిపై తాజాగా జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నం తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అంతే కాకుండా హత్య కేసులో మరణ వాంగ్మూలం పై కీలక వ్యాఖ్యలు చేసింది.

మర్డర్ కేసులో మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని తీర్పును వెలువరించవచ్చునని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందులో నిజం ఉందని సంతృప్తి పడినట్లయితే ఇంకా వేరే సాక్ష్యం అందించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీని ఆధారంగా నిందితులకు శిక్ష వేయవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 
Tags:    

Similar News