హత్యా..లేక నరబలియా..? వీడని తల, మొండెం కేసు మిస్టరీ..?

Update: 2022-01-23 06:30 GMT
తెలంగాణలోని సూర్యపేట జిల్లాలో కలకలం సృష్టించిన జహేందర్ మరణం వీడని మిస్టరీగా మారింది. తల, మొండెం వేరే వేరే చోట్ల పడి ఉండడంపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా..? లేక నరబలినా..? అనే కోణాల్లో లోతుగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హత్య జరిగిన ప్రాంతాలను పరిశీలించి పోలీసులు కాళికా దేవి విగ్రహం వద్ద తలను గుర్తించారు. మూడు రోజుల తరువాత ఓ నిర్మాణ భవనంలో మొండెంను కనుక్కున్నారు. అయితే జహెందర్ ను ఎందుకు చంపాల్సి వచ్చింది..? ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణాలేంటి..? అనే విషయాలు అంతుబట్టడం లేదు. మరోవైపు ఎవరైనా నరబలి కోసం జహేందర్ ను ఎంచుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సూర్యపేట జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీలో ఈనెల 10వ తేదీన మహాంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద తల కనిపించింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నికోణాల్లో విచారణ చేపట్టారు. ఈ తల సూర్యపేట జిల్లా పాకలవీడు మండలం శూన్య పహాడ్ గ్రామానికి చెందిన జహేందర్ నాయక్ గా గుర్తించారు. అయితే అతనికి మతిస్థిమితం లేదని విచారణలో వెల్లడైంది. దీంతో అతని మొండెం కోసం గాలించగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లోని నిర్మానుష్య భవనంలో కనుగొన్నారు. అయితే తల, మొండెం లభించిన ప్రాంతాలు ఒకే రోడ్డును కలిగి ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య 50 కిలోమీటర్ల దూరం ఉంది.

జహేందర్ ను ఎక్కడ హత్య చేసి ఇలా భాగాలను వేరుగా పడేశారు..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  జహేందర్ కు మతిస్థిమితంల లేనందు వల్ల ఈ కేసు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించం లేదు. అయితే హత్యకు పాల్పడిన వారు చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్టపికే పలువురు అనుమానితులను తీసుకొని విచారించి పోలీసులు నిర్మాణంలో ఉన్న ఓ భవన యజమానిని కూడా విచారించారు. రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తగా ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా జహేందర్ మొండెం లభించిన భవనం యజమాని కేశ్యానాయక్ 2018లో హత్యకు గురయ్యాడు. ఆ హత్యకు, దీనికి ఏమైనా సంబంధం ఉందా..? అని అనుమానిస్తున్నారు. కొన్నేళ్ల కిందట ఈ భవన నిర్మాణం చేపట్టగా 2018లో అతడు హత్యకు గుర్యాడు. ఆ తరువాత  అతని ఇద్దరి భార్యల మధ్య గొడవ కారనంగా భవన నిర్మాణం ఆగిపోయింది. తాజాగ జహేందర్ మొండెం కూడా ఇదే భవనంలో లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు అప్పటి కేసుతో సంబంధాలను పరిశీలిస్తున్నారు.
Tags:    

Similar News