విడాకులు...కారణం ఏదైనా కలిసి నడవాల్సిన ఇద్దరు చెరో దారిలో వెళ్లేందుకు వచ్చే గ్రీన్ సిగ్నల్. అయితే విడాకులను తేలికగా ఇచ్చేయడం కొన్ని మత విశ్వాసాల్లో చాలా కామన్‌గా అనేది తెలిసిందే. అందులో పీక్ స్టేజ్‌కి చేరిన ఓ విడాకుల ఎపిసోడ్ ఇది. ఏకంగా సుప్రీంకోర్టు గుమ్మం తొక్కిన ఓ అభాగ్యురాలి ఆవేదన.
ఏం జరిగింది?
'మాట్రిమోనీ పోర్టల్ ద్వారా వివాహం కుదుర్చుకుని 2014లో వివాహం చేసుకున్నాను. వివాహం అయిన రెండు మూడు నెలలకే వరకట్నం డిమాండ్ చేస్తూ మా అత్తమామలు నన్ను మానసికంగా వేధించడం మొదలుపెట్టారు' అని రాజస్తాన్‌లోని జైపూర్ కు అఫ్రీన్ రెహ్మాన్ (25) తన గోడు వెల్లబోసుకున్నారు. 'ఆ తర్వాత కొట్టడం ప్రారంభించారు. అదే ఏడాది సెప్టెంబరులో ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పుడు నేను మా పుట్టింటికి వచ్చేశాను. అయితే షాకింగ్ గా ఇప్పుడు స్పీడ్ పోస్టులో మా ఇంటికి విడాకులు (తలాక్ అని మూడు సార్లు రాసి ఉన్న పత్రం) పంపించారు' అని ఆమె వాపోయారు. 'ఇది పూర్తిగా అన్యాయం - ఆమోదయోగ్యం కానిది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను' అని అఫ్రీన్ చెప్పారు.
గతంలో జరిగిన కేసులో..
తమిళనాడులో 2009లో టెలిగ్రాం ద్వారా ఒక ముస్లిం మహిళకు 'త్రిపుల్ తలాక్'ను పంపగా ఆమె స్థానిక పెరియాకుళం కోర్టును ఆశ్రయించింది. తలాక్‌ను సమర్థిస్తూ కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె మద్రాసు హైకోర్టు ఆశ్రయించగా... కింది కోర్టు ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. స్పీడ్ పోస్ట్‌లో విడాకుల పత్రాలు అందడంపై అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా తీర్పు ఇస్తుందనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.