ముస్లింల‌పై ఎంత‌లా నోరు పారేసుకున్నాడంటే?

Update: 2019-07-15 04:38 GMT
ఒక‌రు త‌ర్వాత మ‌రొక‌రు అన్న‌ట్లుగా వివాదాల్లోకి వెళ్లిపోతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. చేతిలో తిరుగులేని అధికారం ఉన్న వేళ‌.. నోటికి.. చేతికి ప‌ని చెబుతున్న వారి తీరు వివాదాస్ప‌దంగా మార‌ట‌మే కాదు.. ఎంత అధికారం ఉంటే మాత్రం అంత దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేస్తారా? అన్న క్వ‌శ్చ‌న్ క‌లిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు బీజేపీ నేతలు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేస్తున్న వారి తీరుతో కొత్త ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకుంటున్నాయి.

ఇందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు నోరు పారేసుకున్న తీరు చూస్తే.. ముస్లిమేత‌రులు సైతం మండిప‌డ‌టం ఖాయం. చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సాదాసీదా భాష‌తో చెప్పే వీలున్నా.. అందుకు భిన్నంగా రెచ్చ‌గొట్టేలా.. మ‌న‌సు గాయ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేయ‌టం క‌మ‌ల‌నాథుల్లో ఈ మ‌ధ్య కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తున్న మార్పు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బాలియా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర‌సింగ్ తాజాగా మాట్లాడుతూ.. ముస్లింల‌పైన దారుణ వ్యాఖ్య‌లు చేశారు. ముస్లింలు జంతువుల్లా ఎక్కువ‌మంది భార్య‌ల్ని పెళ్లాడ‌టంతో పాటు పెద్ద సంఖ్య‌లో పిల్ల‌ల్ని కంటున్నార‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  గ‌తంలో ప్రతి హిందువు దంప‌తులు  క‌నీసం ఐదుగురు పిల్ల‌ల్ని క‌నాల‌ని.. అప్పుడే హిందుత్వం చెక్కుచెద‌ర‌కుండా ఉంటుంద‌న్నారు.

అయినా.. హిందువులు ఐదుగురేసి పిల్ల‌ల్ని కంటే.. వార‌ప్పుడు జంతువులు కాకుండా ఉంటారా?  మ‌న‌షులుగా ఉన్న హిందువుల్ని జంతువుల్ని చేసేసే సురేంద్ర‌సింగ్ మాట‌లు.. ఇప్పుడు స్లో పాయిజ‌న్ మాదిరి నెమ్మ‌దిగా ఎక్కించేస్తున్న ఆయ‌న‌.. తాజాగా మ‌రింత దుర్మార్గ‌పు వ్యాఖ్య‌లు చేశార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

సొసైటీలో ఇద్ద‌రు లేదా న‌లుగురు పిల్ల‌లు ఉండ‌టం సాధార‌ణ‌మైన అంశ‌మ‌ని.. కానీ ముస్లిం మ‌త‌స్తులు మాత్రం అందుకు భిన్నంగా 50 మంది భార్య‌ల్ని చేసుకొని 1050 మంది పిల్ల‌ల్ని కంటున్నార‌న్న విష‌యం మీకు తెలుసా? అంటూ క్వ‌శ్చ‌న్ చేశారు. ఇలా బ‌హుభార్య‌లు.. అధిక సంతానం మంచిది కాద‌ని.. ఇది జంతువులు ప‌ద్ద‌తి అని నోరు పారేసుకున్నారు.

ఇలాంటి మాట‌లు స‌మాజాన్ని మార్చ‌టం త‌ర్వాత‌.. మ‌రింత‌గా చీలిపోయేందుకు అవ‌కాశం ఇస్తుంద‌న్న విష‌యాన్ని సురేంద్ర సింగ్ ఎప్ప‌టికి గ్ర‌హిస్తారు?  ఇలాంటి వ్యాఖ్య‌ల కార‌ణంగా ముస్లిం ప్ర‌జ‌ల్లో విష బీజాలు నాటేలా బీజేపీ నేత మాట‌లు ఉండ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలంటున్నారు.అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా మారిన బీజేపీ.. బాధ్య‌తారాహిత్యంతో మాట్లాడే వారిని క‌ట్ట‌డి చేస్తుంద‌నుకోవ‌టం అత్యాశే అవుతుందేమో?
Tags:    

Similar News