నేవీ అధికారుల‌కు సుప్రీం అనూహ్య ఆర్డ‌ర్‌

Update: 2016-12-16 13:21 GMT
భార‌త స‌ర్వోన్న‌త న్యాయం మ‌రో అనూహ్య తీర్పు వెలువరించింది. థియేట‌ర్ల‌లో జాతీయ గీతం పాడాల‌ని, పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఖాతాధారుల‌కు త‌ప్ప‌నిస‌రిగా 24 వేలు ఇవ్వాల‌ని ఇటీవ‌ల అనూహ్య తీర్పులు ఇచ్చిన‌ట్లే... భారత వాయుసేన (ఐఏఎఫ్) అధికారులు గడ్డం పెంచరాదని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఆ అధికారి ఏ కులం - మతం - ప్రాంతానికి చెందిన వారైనా సరే ఇదే తీర్పు వర్తిస్తుందని పేర్కొంది.

2003లో వాయుసేన అధికారులు గడ్డం పెంచుకోవ‌డంపై కేంద్రం నిషేధం విధించింది. ఈ క్రమంలో అదే ఏడాది ఫిబ్రవరి 24న మహమ్మద్ జుబేర్ - అన్సారి ఆఫ్తాబ్ తాము ముస్లింలమని తమకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఢిల్లీ హైకోర్టు అందుకు నిరాకరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఈ పిటిష‌న్ ను విచారించింది. మత ఆచారాల ప్రకారం గడ్డం పెంచేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించకపోవడం ప్రాథమిక హక్కులను ఎలా ఉల్లంఘించినట్టు అవుతుందని ప్రశ్నించింది. దేశ భ‌ద్ర‌త రీత్యా కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌ను పాలో కావాల‌ని ఆదేశించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News