ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక వీరాభిమాని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మోడీ.. దాన్ని ఆపించేశారు. కట్ చేస్తే.. మళ్లీ ఇన్నాళ్లకు మోడీ మందిర్ పేరుతో ఒక నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్న వైనం తాజాగా తెర మీదకు వచ్చింది.
అయితే.. ఈ ప్రపోజల్ తెచ్చిన వారి బ్యాక్ గ్రౌండ్ ఆసక్తికరంగా ఉంది. ముజఫర్ నగర్ కు చెందిన బీజేపీ ముస్లిం విభాగానికి చెందిన కార్యకర్తలు కొందరు.. తమ సొంత స్థలంలో ఈ మందిర్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీని నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించారు. దేశానికి ఎంతో సేవ చేస్తున్న మోడీకి విదేశాలు కూడా పురస్కరాలు ఇస్తున్నాయని.. అందుకే కృష్ణపురి ప్రాంతంలో మోడీ మందిర్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ మందిర్ లో మోడీకి సంబంధించిన వివరాలు వివరించేందుకు వీలుగా ప్రదర్శనశాలను నిర్మిస్తామని చెబుతున్నారు. తాము నిర్మించాలని భావిస్తున్న మోడీ మందిర్ ను తమ సొంత భూమిలోనే నిర్మిస్తామని బీజీపీ ముస్లిం కార్యకర్త సమర్ గజ్ని.. బీజేపీ మహిళా విభాగం సభ్యురాలు రూబీ గజ్జీతో పాటు పలువురు కార్యకర్తలు కలెక్టర్ ను కలిసి అనుమతిని కోరారు. అంతా బాగుంది కానీ.. తన గురించి వివరించే మందిర్ ఏర్పాటుకు మోడీ ఓకే అంటారా? లేక.. గతంలో మాదిరి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఆపేసినట్లు.. ఈ ప్రాజెక్టును ఆపేస్తారో చూడాలి. ఈ మ్యూజియంలో మోడీకి సంబంధించిన అంశాలతో పాటు.. ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. దీనిపై మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.