గవర్నర్‌ గా మురళీధరన్‌ కొత్త ఇన్నింగ్స్..!

Update: 2019-11-28 08:08 GMT
శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దూస్రా కింగ్ గా  - 1996లో శ్రీలంక ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం క్రికెట్ నుండి రిటైర్ అయిన మురళీధరన్ ..  బౌలింగ్‌ లో పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు. టెస్ట్ ఫార్మాట్‌ లో - వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడిన మురళీ 800 వికెట్లు పడగొట్టాడు. 350 వన్డేల్లో 534 వికెట్లు - 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

ఇక  తాజాగా నార్తర్న్ ప్రావిన్స్‌ కి గవర్నర్‌ గా నియమితమవబోతున్నాడన్న ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ ఆధిపత్యం ఎక్కువగా ఉండే నార్తర్న్ ప్రావిన్స్‌ కు ముత్తయ్యను గవర్నర్‌ గా నియమించబోతున్నారన్న ప్రచారంపై అక్కడి ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారతీయ సంతతికి చెందిన - శ్రీలంక తమిళుడైన ముత్తయ్య మురళీధరన్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో గొటబాయ రాజపక్సేకు బహిరంగంగా మద్దతు పలికారు. అధ్యక్షడిగా ఎన్నికైన తరువాత   మురళీధరన్‌ ను ప్రత్యేకంగా ఆహ్వానించి  లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బాధ్యతలను చేపట్టాలని అయన విజ్ఞప్తి చేశారని సమాచారం.

 ఇక రాజపక్స ప్రభుత్వంలో మురళీధరన్‌ తో పాటు అనురాధ యహంపతి ఈస్ట్ ప్రావిన్స్‌ - తిస్సా వితర్ణ నార్త్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌ లకు గవర్నర్‌ గా బాధ్యతలు స్వీకరిస్తారని రాష్ట్రపతి సచివాలయ వర్గాలు తెలిపాయి. చూడాలి మరి క్రికెట్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ ముత్తయ్య మురళీధరన్ ..గవర్నర్ గా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో ..
Tags:    

Similar News