ప‌వ‌న్ గుండు ఇష్యూ పై ప‌రిటాల సునీత క్లారిటీ!

Update: 2018-01-28 17:00 GMT
జనసేన అధినేత - సినీ న‌టుడు పవన్ కల్యాణ్‌ కు దివంగత నేత పరిటాల రవి గుండు కొట్టించారని కొద్ది సంవత్స‌రాల క్రితం పుకార్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌హిరంగంగా ఎప్పుడూ స్పందించ‌లేదు. అయితే, కొద్దిరోజుల క్రితం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా ఆ వార్త‌ల‌ను  మీడియా సాక్షిగా ఖండించారు. త‌న‌కు అప్ప‌ట్లో ప‌రిటాల ర‌వి అంటే ఎవ‌రో తెలీద‌ని - సినిమాలతో విసిగిపోయి త‌న ఇష్ట‌ప్ర‌కారమే గుండు కొట్టించుకున్నానని క్లారిటీ ఇచ్చారు. తాజాగా, ఇదే వ్య‌వ‌హారంపై మంత్రి పరిటాల సునీత తాజాగా స్పందించారు. ప‌రిటాల ర‌వి అంద‌రికీ స‌పోర్ట్ చేసే మ‌నిష‌ని - ఆయ‌న ఎవ‌రికీ గుండు కొట్టించ‌లేద‌ని చెప్పారు. ఆయ‌న ఒక‌రిని ఇబ్బందిపెట్టే వ్య‌క్తి కాద‌ని స్ప‌ష్టం చేశారు.   

అనంత‌పురంలో పర్య‌టిస్తున్న‌ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్.....ఈ రోజు ఉద‌యం మంత్రి ప‌రిటాల సునీత ఇంటికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. జిల్లా ప‌రిస్థితులు - అక్క‌డ ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ఆమెను ప‌వ‌న్ అడిగి తెలుసుకున్నారు. ప‌రిటాల‌ సునీత‌ - ప‌రిటాల శ్రీ‌రామ్ ల‌తో ప‌వ‌న్ కొద్ది సేపు భేటీ అయ్యారు. ఈ రోజు మీడియా ప్రతినిధులు ప‌వ‌న్ ను ఆ వ్య‌వ‌హారంపై ప్ర‌శ్నించ‌గా....ఆయ‌న చిరున‌వ్వు న‌వ్వి ఊరుకున్నారు. అనంత‌రం - మీడియాతో మాట్లాడిన పరిటాల సునీత‌కు కూడా ఇదే ప్ర‌శ్న ఎదురైంది. ఈ విష‌యం గురించి తాము కూడా పేపర్లు - టీవీల్లో చూడటం - బయట యూత్ మాట్లాడుతుంటే విన్నామ‌ని - అయితే - మా ఆయన ఎవరికీ గుండు కొట్టించలేదని సునీత క్లారిటీ ఇచ్చారు. అసలు గుండు కొట్టించే వ్యక్తి పరిటాల రవి కానే కాదని - ప్రతి ఒక్కరికీ ఆయన సపోర్టు చేసే వ్యక్తే న‌ని చెప్పారు. ఆయ‌న ఎవర్నీ ఇబ్బంది పెట్టే వ్యక్తి కాద‌ని - ఎవ‌రో ఏదో అనుకుంటే  మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సునీత స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News