వింత జీవులు ఏవయినా వాటిపై కలిగే ఆసక్తి ఓ రేంజ్ లో ఉంటుంది. అది అంతరిక్షంలో ఉండే ఏలియన్స్ కావచ్చు....సముద్రంలోని కావచ్చు. అయితే సముద్రంలో ఉండే వాటిల్లో వింత జీవులు తక్కువే. కానీ అలాంటి వింత జీవి ఫిలిప్పీన్స్‌లో చర్చనీయాంశంగా మారింది! అక్కడి దినాగట్ దీవుల్లో ఈ మధ్య సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిందో వింత భారీ జీవి. ఆ భారీ ఆకారం గురించి పరిశోధనలు చేసే స్థాయికి పరిస్థితి చేరిందంటే ఎంత క్రేజ్ పుట్టిందో అర్థం చేసుకోవచ్చు.
దినాగట్ దీవుల్లోని సముద్రపు ఒడ్డుకు భారీ ఆకారం ఒకటి కొట్టుకు వచ్చింది. సుమారు 20 అడుగుల పొడవు, శరీరమంతా తెల్లని వెంట్రుకలతో కూడిన ఈ జంతు కళేబరం చిత్రంగా ఉంది. దీన్ని చూసిన వారిలో కొందరు షాక్ తినగా ఇంకొందరు దానితో సెల్ఫీలు దిగారు ఎప్పుడూ చూడని కొత్త జీవి అంటూ మరికొందరు ఆశ్చర్య పోయారు. అయితే ఈ వార్త ఆ నోటా ఈనోటా అందరికీ పాకడంతో ప్రజల తాకిడి పెరిగిపోయింది. అయితే ఇంటర్నెట్ లో సైతం దీనిపై రకరకాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఓ హాలీవుడ్ చిత్రంలోని యానిమేషన్ క్యారక్టర్ లా ఉందని కొందరు జోక్ చేశారు.
మరోవైపు అందరినీ ఆకర్షించిన ఈ వింత జీవిపై పరిశోధకులు రంగంలోకి దిగారు. ఇటీవల భూకంపం సంభవించిన నేపథ్యంలో మరణించిన ఇది తీరానికి కొట్టుకువచ్చినట్టు భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి పరిశోధనలు జరిపిన తర్వాతే తాము విషయమనేది తేల్చనున్నట్లు పరిశోధకులు వివరిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/