ప్రముఖ టిక్ టాక్ స్టార్, బిగ్ బాస్ బ్యూటీ.. బీజేపీ నాయకురాలు అయిన సోనాలి ఫోగట్ మృతి కేసు మిస్టరీ వీడింది. ఇప్పటివరకూ గుండెపోటుతో చనిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. పోస్టుమార్టం అనంతరం ఇది హత్యగా తేల్చారు. సోనాలి ఫోగట్ సన్నిహితులు ఆమెకు విష పదార్థాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె విషకరమైన పదార్థాలను తీసుకోవడం ద్వారా చనిపోయినట్లుగా గోవా పోలీసులు తెలిపారు. ఆమెతో బలవంతంగా కెమికల్స్ ను తాగించిన తర్వాత ఆమె సృహ కోల్పోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు.
గోవా ఐజీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సోనాలి ఫోగట్ హత్యకు గురైనట్లు నిర్ధారించామన్నారు. ఈ కేసులో ఆమె సన్నిహితులు సుధీర్ సగ్వాన్, సుఖ్విందర్ వాసీలపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. విచారణ జరుగుతోందని.. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరుచనున్నట్లు వెల్లడించారు.
ఇద్దరు సన్నిహితుల్లో ఒకరు సోనాలి ఫోగట్ కు బలవంతంగా విషకరమైన రసాయనాలను తాగించారని.. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఈ రసాయనాలు తాగడం ద్వారానే ఆమె చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఐజీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు.
గోవా టూర్ కు వెళ్లిన సోనాలి ఫోగట్ ఈనెల 23వ తేదీన హోటల్ గదిలో ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తొలుత సోనాలి ఫోగట్ గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు పోలీసులు, వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అందరూ ఆమె గుండెపోటుతో మరణించారని భావించారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు సోనాలిది గుండెపోటు కాదని.. హత్య అంటూ గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా ఆమెది హత్య అని తేలింది. సోనాలి ఫోగట్కు బలవంతంగా కెమికల్స్ తాగించారని పోలీసులు తెలిపారు. ఆమె శరీరంపై గాయాలు ఉండడంతో కొట్టినట్టుగా కూడా తెలుస్తోంది.
హర్యానా సీఎం ఖట్టర్ ను సోనాలి ఫొగట్ కుటుంబ సభ్యులు కలిసి సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయగా.. ఆయన అంగీకరించారు. ఈ విషయమై కోరుతానని ప్రకటించారు. ప్రభుత్వంతో ఫాలో అప్ లో ఉన్నట్లు వెల్లడించారు.