నమ్మకం.. ఆత్మవిశ్వాసం లేకుండా రాజకీయాల్లో రాణించటం అంత తేలికైన విషయం కాదు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేరు. ఒక చిన్న పరిణామం సీన్ మొత్తాన్ని మార్చేస్తుందన్నది మర్చిపోకూడదు. క్రికెట్ కు.. రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉంటుందని చెప్పొచ్చు. ఆఖరి బాల్ లో కూడా మ్యాచ్ ఫలితం మొత్తం మారిపోయినట్లే.. రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అస్సలు చెప్పలేం.
అలాంటి మరో నాలుగేళ్లకు జరిగే దాని గురించి ఇప్పటి నుంచే చెప్పుకోవటం.. కోతలు కోయటం అంత మంచిది కాదన్న విషయాన్ని నాగబాబు మర్చిపోతున్నట్లున్నారు. తనకు అధికారం అవసరం లేదని.. కేవలం ప్రజా సమస్యల మీద పోరాటం చేయటమే తన లక్ష్యమని చెప్పే తమ్ముడు పవన్ కల్యాణ్ మాటల్ని నాగబాబు మర్చిపోయినట్లున్నారు
2014 ఎన్నికల్లో పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలైన విషయాన్ని మర్చిపోయారేమో కానీ.. 2024లో విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే బీజేపీతో పొత్తులు కలిసి.. రానున్న రోజుల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని డిసైడ్ కావటం తెలిసిందే. దీంతో.. కొత్త ఆశలు చిగురించినట్లున్నాయి. అందుకే కాబోలు.. తాజాగా నాగబాబు మాట్లాడుతూ.. 2024లో బీజేపీతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడేం రద్దు చేస్తుందో తెలీదంటూ సటైర్ వేసిన నాగాబాబు.. నాలుగేళ్ల తర్వాత ఏదో జరిగిపోతుందన్న మాట ఇప్పటి నుంచే చెప్పటం తగ్గిస్తే మంచిదేమో? ఇలాంటి మాటలకు దిష్టి తగిలితే.. మొదటికే మోసం వస్తుందో కాస్త ఆలోచించండి నాగబాబు?