ఈ ప్రశ్న విశాఖ మీడియా అడిగింది. ఎవరిని అంటే నాడు ప్రజారాజ్యంలోనూ నేడు జనసేనలోనూ కీలకమైన భూమిక నాయకుడిగా ఉన్న నాగబాబుని. ఈ ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పగలరని మీడియా వేసి ఉంటుంది. దానికి నాగబాబు ఇచ్చిన జవాబు ఏంటి అంటే అది ప్రజారాజ్యం. ఇది జనసేన అంతే తేడా అని. చాలా సింపుల్ గా ఆయన జవాబు చెప్పినా మన మీడియా ఊరుకోదు కదా. వారి ఉద్దేశ్యం పాలసీలు, ఎత్తుగడలు వంటివి వగైరా వగైరా అని.
అయితే నాగబాబు మాత్రం ఒకే ఒక మాటతో ముక్తాయింపు ఇచ్చేశారు. ప్రజారాజ్యం పార్టీ ఈజ్ ఓవర్ కదా. అది అయిపోయింది కదా. దాని గురించి కొత్తగా మాట్లాడేది ఏముంది. జనసేన గురించి మాట్లాడుదామని నాగబాబు చెప్పుకొచ్చారు.
ఇక పొత్తుల విషయమైనా మరోటి అయినా అంతా పవన్ కళ్యాణే చూసుకుంటారు అని నాగబాబు చెప్పడం విశేషం. తాను కూడా జనసేనలో ఒక సామాన్య కార్యకర్త అని ఆయన అంటున్నారు. తాను జనసేన ఫ్యామిలీని చూడడానికే మూడు జిల్లాల టూర్ చేశానని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రా నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న కోరిక కానీ ఆశ కానీ తనకు ఏ కోశానా లేదని నాగబాబు స్పష్టం చేశారు. తాను కేవలం పార్టీ పటిష్టత కోసమే పనిచేస్తానని, పదవులు తనకు ఏవీ వద్దు అని ఆయన అంటున్నారు.
తమ పార్టీ రాజకీయాలలో ఉందంటే ప్రజలకు సేవ చేయాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశ్యంతోనే అని ఆయన అంటున్నారు. తరతరాలుగా కొన్ని కుటుంబాల చేతులలోనే రాజకీయాలు ఉండిపోయాయని ఆయన అంటూ దాన్ని మార్చాలని అభిప్రాయపడ్డారు.
తమ పార్టీ ఉత్తరాంధ్రాలో పటిష్టంగా ఉందని, ప్రతీ కార్యకర్త కూడా తమకు ఒక నాయకుడే అని ఆయన చెప్పడం విశేషం. త్వరలోనే సంస్థాగతంగా కూడా కమిటీలు వేసి పార్టీ నిర్మాణం చేస్తామని ఆయన చెప్పారు. మొత్తం మీద ప్రజారాజ్యం జనసేన ప్రస్థావనను మీడియా తెచ్చినా నాగబాబు చాలా బోల్డ్ గా కూల్ గా సమాధానం ఇవ్వడమే ఇక్కడ విశేషం.