చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఇప్పుడు ఓటీటీ వేదికగా ఎంటర్ టైన్ పంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు హీరోలు బుల్లి తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపించే వారు కాదు. కాని ఇప్పుడు వెండి తెరపై కంటే ఎక్కువగా బుల్లి తెరకు రీచ్ ఉంటుంది. అలాగే బుల్లి తెరపై కనిపించే వారికి కూడా భారీ మొత్తంలో పారితోషికాలు వస్తున్నాయి.
సినిమా పరిశ్రమను మించి టీవీ మరియు ఓటీటీ పరిశ్రమలు మారిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందు ముందు ఇంకా భారీ మార్పులు రాబోతున్నాయి. అందుకే ప్రముఖ స్టార్స్ అంతా కూడా ఓటీటీ వెంట పడటం తప్పేంటి అంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ అంటూ టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డిజిటల్ వేదికగా సమంత చేసిన సామ్ జామ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి సీజన్ పూర్తి చేసిన సమంత రెండవ సీజన్ ను త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇక సమంత తర్వాత నాగచైతన్య కూడా డిజిటల్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున ఒక వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న థ్యాంక్యూ సినిమా కు దర్శకత్వం వహిస్తున్న విక్రమ్ కుమార్ తో కలిసి ఆ వెబ్ సిరీస్ నిర్మాణం చేపట్టబోతున్నాడట. విక్రమ్ కుమార్ తయారు చేసిన స్క్రిప్ట్ తో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ నాగచైతన్య మరియు విక్రమ్ కుమార్ లు కలిసి ఒక ప్రముఖ ఓటీటీ కోసం ఆ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.