నాగం జనార్దన్ రెడ్డి... ఉమ్మడి రాష్ట్రంలో... అది కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి హయాంలో కీలక నేతగా ప్రసిద్ధికెక్కారు. బాబు కేబినెట్ లో సీనియర్ మంత్రిగా - బాబు కోటరీలో ముఖ్యుడిగా కొనసాగిన నాగం... బాబు రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అయిపోయారు. పనికి ఆహారం పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన బియ్యాన్ని అక్రమంగా తరలించేసుకుని జేబులు నింపుకున్న నాగం ను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఏకంగా బియ్యం రెడ్డి అంటూ పిలిచి సంచలనం సృష్టించారు. చాలా కాలం పాటు క్రియాశీల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాగం... రాష్ట్ర విభజనకు కాస్తంత ముందుగా టీడీపీ నుంచి బయటకు వచ్చి దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయారు. ఒకప్పుడు బాబు వెన్నంటే నడిచిన నాగం... తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబుకు చాలా దూరమే అయిపోయారు.
సరే... ఇప్పుడు నాగం విషయం ఎందుకంటారా?... ఎందుకేమిటండీ బాబూ... నాడు తన రాజకీయ గురువుగా - తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబును నేటి ఉదయం నాగం ప్రత్యక్షంగా కలిశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబును కలిసేందుకు బయలుదేరిన నాగం... జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు కొత్త నివాసానికి చేరుకున్నారు. చాలా కాలం తర్వాత తనను కలిసేందుకు వచ్చిన నాగంను చూసిన చంద్రబాబు ఆయనకు సాదర స్వాగతం పలికారట. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఏకాంతంగా చాలా సేపే మాట్లాడుకున్నారట. సరే... ఏకాంతంగా జరిగిన భేటీలో ఏమేం మాట్లాడుకున్నారో బయటకు తెలియదు కదా. అలాగే... ఓ అరగంట పాటు బాబుతో ఏవో మంతనాలు సాగించిన నాగం... ఆ తర్వాత మీడియా ముందు నోరు విప్పకుండానే వెళ్లిపోయారు.
ఓ వైపు తెలంగాణలో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం, ఇప్పుడు నాగం కాంగ్రెస్ లో ఉండటం... ఈ క్రమంలోనే బాబుతో నాగం భేటీ జరగడం వెనుక పెద్దగా ఏదో సంచలనాలు ఉంటాయన్న భావన అయితే లేదు గానీ... చాలా కాలం తర్వాత తనను కలిసిన తన అనుంగు అనుచరుడితో బాబు ఏం మాట్లాడి ఉంటారన్న ఆసక్తి అయితే రేకెత్తింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో తనకు రాజకీయ ఓనమాలు దిద్దించిన చంద్రబాబును కూడా విమర్శించిన నాగం... ఇప్పుడు ఉన్నట్టుండి బాబుతో కలవడానికి నేరుగా ఆయన ఇంటికే వెళ్లడం చూస్తుంటే... ఏదో ఉందని మాత్రం అనిపించడం సాధారణమే కదా. మరి వీరి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్న విషయం ఎలా బయటపడుతుందో చూడాలి.