గ‌త రికార్డుల్ని బ్రేక్ చేసిన బాలాపూర్ ల‌డ్డూ

Update: 2017-09-05 06:01 GMT
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో వీధికి నాలుగైదు వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేయ‌టం కామ‌నే. అయితే.. ఎన్నో ద‌శాబ్దాలుగా ఏర్పాటు చేస్తున్న బాలాపూర్ గ‌ణేశ్ పందిరికి ఉన్న ప్ర‌త్యేక‌త వేరు అని చెప్పాలి. కోరిన కోరిక‌ల్ని ఇట్టే తీర్చేసే దేవుడిగా ఆయ‌న‌కు పేరుంది. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలాపూర్ ల‌డ్డూవేలం గురించి ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

ఏడాదికి ఏడాది బాలాపూర్ ల‌డ్డూ వేలం పాట ఎక్క‌డికో వెళుతోంది. గ‌త ఏడాది వినాయ‌క చ‌వితికి బాలాపూర్ ల‌డ్డూ ఏకంగా రూ.14.65 ల‌క్ష‌ల‌కు వేలంపాట‌లో సొంతం చేసుకోవ‌టంతో అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. గ‌ణేషుడి ల‌డ్డూ కోసం అన్నేసి ల‌క్ష‌లకు వెనుకాడ‌కుండా ఖ‌ర్చు చేయ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఈసారి అప్పుడే బాలాపూర్ ల‌డ్డూ వేలం పెట్టేశారు. గ‌తంలో బాలాపూర్ లడ్డూ కోసం 17 మందిపోటీ ప‌డితే ఈసారి ఏకంగా 21 మంది పోటీ ప‌డ్డారు. వెయ్యి నూట ప‌ద‌హార్ల‌తో మొద‌లైన ల‌డ్డూ వేలంపాట అంత‌కంత‌కూ పెరిగిపోయింది. చివ‌ర‌కు రూ.15.60 ల‌క్ష‌ల రికార్డు ధ‌ర‌కు ప‌లికింది. నాగం తిరుప‌తి రెడ్డి అనే పెద్ద‌మ‌నిషి ఈ వేలంలో పాల్గొని  బాలాపూర్ ల‌డ్డూను సొంతం చేసుకున్నారు. గ‌త ఏడాదికి ఈ ఏడాది బాలాపూర్ ల‌డ్డూలో పెరిగి ధ‌ర ఏకంగా రూ.95వేలు కావ‌టం గ‌మ‌నార్హం. ల‌డ్డూ వేలంపాట‌లో వ‌చ్చిన మొత్తాన్ని గ్రామాభివృద్ధి కోసం వినియోగించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు బాలాపూర్ వాసులు చెబుతున్నారు.
Tags:    

Similar News