తమిళనాడు కాంగ్రెస్ లో ఇద్దరు స్టార్స్ మధ్య వార్ వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రూపు నేతల్ని ఏకం చేసి ఒకే వేదిక మీద కూర్చోబెట్టడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు. కానీ.. పార్టీలో సినీ స్టార్స్ గా - జాతీయ స్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నాయకురాళ్లు మాత్రం అందరికీ షాకిచ్చారు. ఈ క్రమంలో ఉదయం నిరసన కార్యక్రమానికి హాజరైన కుష్బు - సాయంత్రం తన నేతృత్వంలో సత్యమూర్తి భవన్ వేదికగా సాగిన మహిళా కాంగ్రెస్ సమాలోచనకు గైర్హాజరు కావడాన్ని నగ్మా తీవ్రంగానే పరిగణించారు. ఆ సమావేశంలో కుష్బును ఉద్దేశించి నగ్మా మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు!
దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాదు. అయితే తాజాగా తమిళనాడులో అలాంటి గ్రూపుల నేతలందరూ ఒకే వేదిక మీదకు వచ్చి మౌనంగా ఉండగా... జాతీయ స్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నేతల్లో ఒకరు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయగా - మరోకరు "చూడలేదు.. వినలేదు" అంటూ స్పందించి రాష్ట్ర కాంగ్రెస్ లో కొత్త చర్చకు తెర లేపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నగ్మా... సినీమాల్లో బొట్టు పెట్టుకుని నటించవచ్చు కాని, వాస్తవిక జీవితంలో అలా ఏ ముస్లిం మహిళ చేయొద్దని చెబుతూ... హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్న వాళ్లకు ముస్లిం చట్టాల గురించి ఏమి తెలుసు? అంటూ కుష్బును ఉద్దేశించి మాటల తూటాలు పేల్చారు. ఉదయం జరిగిన నిరసనకు హాజరైన వాళ్లకు, సాయంత్రం జరిగిన సమావేశానికి వచ్చే తీరిక లేదా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
దీంతో ఈ వ్యాఖ్యలన్నీ కుష్బూ గురించే అని అందరికీ స్పష్టమైపోయింది. దీంతో నగ్మా చేసిన వ్యాఖ్యల గురించి కుష్బు వివరణను కోరగా... "కళ్లతో చూడ లేదు.. చెవులతో వినలేదు" అంటూ ఆమె వ్యాఖ్యానించారు. తనకు షూటింగ్ కార్యక్రమం ఉందని, దాంతో ఆ షూటింగ్ ను కాసేపు వాయిదా వేసుకుని నిరసన కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. సాయంత్రం నగ్మా ఆధ్వర్యంలో జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశం గురించి తనకు ఎలాంటి పిలుపురాలేదని వ్యాఖ్యానించారు. నగ్మా తనను ఉద్దేశించి తీవ్రంగా స్పందించినట్టు తాను స్వయంగా చూడలేదని.. వినలేదని.. ఆ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కుస్భూ తోసిపుచ్చడం గమనార్హం. కాగా... ఈ మహిళా నేతల వార్ మాత్రం తమిళనాట కాంగ్రెస్ లోనే కాదు మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యింది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/