రాజకీయం అంటే ఏంటో - వాటి అసలు రూపం ఏంటో సినీనటులకు రంగంలోకి దిగితే కానీ తెలియదంటారు. అలా ఎందరో వ్యక్తిగతంగా చేదు అనుభవాలను చవిచూశారు. ఇపుడు ఆ జాబితాలోకి ప్రముఖ నటి నగ్మా వచ్చిచేరారు. అయితే ఆమెకు షాక్ ఇచ్చింది కూడా మరో నటి కావడం ఆసక్తికరం. పైగా గతంలో తను దెబ్బకొట్టిన వ్యక్తి చేతిలోనే దెబ్బతినడం ఆసక్తికరం! వెటరన్ యాక్ట్రెస్ - ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నగ్మా దెబ్బ తిన్న వ్యక్తి అయితే, ఆమెపై రివెంజ్ తీర్చుకున్నది సీనియర్‌నటి కుష్బూ.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న నగ్మా తమిళనాడు ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాలపై ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో దాదాపు రెండేళ్ల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో సన్నిహితంగా ఉన్న నగ్మా చక్రం తిప్పి కుష్బును ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా చేశారు. ఎందుకంటే నగ్మా సైతం మైలాపూర్ టికెట్ ను ఆశించారు! తనదైన శైలిలో ఆమె ప్రయత్నం చేసుకుంటూ పోయారు. అయితే ఈ ఇద్దరు మాజీ హీరోయిన్ల ఎన్నికల పోటీ ఆసక్తిని పసిగట్టిన కాంగ్రెస్ పెద్దలు అనవసర వివాదం ఎందుకు అనుకొని వేరే నాయకుడికి ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే అధినేత్రి - తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద పోటీ చేసేందుకు సిద్ధమైన కుష్బు ఆలోచన విరమించుకున్నారు.
అయితే ఇదంతా గతం. ఇప్పుడు కుష్బూ సైతం రివెంజ్ తీర్చుకున్నారు. మారిన రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ ఆలోచనను పసిగట్టిన కుష్బూ ఆమె తీరుపై కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పేచీలు పెట్టుకుంటున్న తీరుపై ఫిర్యాదులు చేయించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తన పార్టీని సంస్కరించే బిజీలో ఉన్న నేపథ్యంలో నగ్మాపై వచ్చిన ఫిర్యాదులపై సీరియస్ గా స్పందించారు. ఆమెను తమిళనాడు ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పించారని సమాచారం. కాగా, తమిళులు తెగ ఆరాధించే, గతంలో కొందరు ఏకంగా గుడి కూడా కట్టించిన గౌరవాన్ని పొందిన కుష్బూ కొత్త బాధ్యతలతో ఎలాంటి ముద్రను వేసుకుంటారో చూడాలి మరి.