వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్ కు కష్టాలు తప్పేలా లేవు. నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి దేశ ప్రజల మనోభావాలను కించపరిచేలా స్వాతంత్ర్యం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి.
గతంలో స్వాతంత్య్రం గురించి మాట్లాడుతూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్ కు స్వాతంత్ర్యం అనేది 2014లో వచ్చిందని.. 1947లో మనకు లభించింది భిక్ష మాత్రమేనని కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఏకంగా కంగనా మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకుంది.
గాంధీ చెప్పినట్లు ఒక చెంప చూపితే స్వాతంత్ర్యం రాదని.. భిక్ష మాత్రమే వస్తుందని.. స్వాతంత్ర్య వీరులు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ కు గాంధీ మద్దతు లభించలేదని ఆమె వరుసగా ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం సృష్టించాయి.
అప్పటి నుంచి ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కంగనాపై దేశ ద్రోహం కేసులు కూడా పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు.
ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలకు నిరసనగా జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో కంగనాపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రమంత్రి, కాంగ్రెస్ నేత విజయ్ వాడ్డేటి వార్ కంగనాపై విరుచుకుపడ్డారు.
‘గాంధీపై కంగనా చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవి.. ఒక ఐటెం గర్ల్ చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఆమె గురించి ఎక్కువగా చర్చ అవసరం లేదు’ అని మంత్రి విజయ్ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.
తాజాగా కంగన వ్యాఖ్యలపై మొన్న ముంబైలో కేసు నమోదు కాగా.. తాజాగా హైదరాబాద్ లో ఆమెపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు స్వాతంత్ర్యంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది కరం కొమిరెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో న్యాయవాది గట్టిగా వాదించారు. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కంగనా వ్యాఖ్యానించారని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ అంశంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సైఫాబాద్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.