అవును బావమరిది నందమూరి బాలకృష్ణను తాజాగా నియమించిన టీడీపీ పొలిట్ బ్యూరోలో చంద్రబాబునాయుడు సభ్యునిగా నియమించారు. టీడీపీ పొలిట్ బ్యూరో అన్నదే అత్యున్నత వేదిక అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాలుగా బాలయ్య బాబు పార్టీలో కంటిన్యు అవుతున్నా ఇంతకాలానికి పొలిట్ బ్యూరోలో సభ్యత్వం లభించటం గమనార్హం. ఒకపుడు బాలయ్య సోదరుడు నందమూరి హరికృష్ణ కూడా పొలిట్ బ్యూరోలో సభ్యునిగా ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ నందమూరి కుటుంబం నుండి ఎవరూ అత్యున్నత వేదికలో సభ్యత్వం అందుకోలేదు.
నిజానికి బాలయ్యకు పార్టీ పరంగా పదవి ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. ఎందుకంటే ఒకవైపు హిందుపురం ఎంఎల్ఏగా, మరోవైపు సినీ హీరోగా బాలయ్య చాలా బిజీగా ఉంటారు. కాబట్టే పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనబడరు. నిజంగా చెప్పాల్సొస్తే సినిమా షూటింగుల్లో గ్యాప్ వచ్చినపుడు మాత్రమే నియోజకవర్గంలో కనబడుతుంటారు. ఇంత బిజీగా ఉన్న బాలయ్య ఇక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం రెగ్యులర్ గా ఎక్కడ వస్తారు. అయితే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. షూటింగ్ విరామాల్లో మాత్రమే అసెంబ్లీలో బాలయ్య కనబడుతుంటారు. సినిమాల్లో బిజీగా ఉంటారు కాబట్టే అసెంబ్లీ సమావేశాలకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ బాలయ్య రావాలని, వస్తాడని ఎవరు అనుకోరు.
కానీ మహానాడు కార్యక్రమాలకు మాత్రం బాలయ్య ఎంత బిజీగా ఉన్న హాజరవుతుంటారు. ఎందుకంటే మహానాడు అనేది పార్టీ వ్యవస్ధాపకుడు, తండ్రి ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే మూడురోజుల పార్టీ పండుగ కాబట్టి తప్పకుండా హాజరవుతారు. ఇపుడేదో కరోనా వైరస్ కారణంగా షూటింగులు జరగటం లేదు కాబట్టి బహుశా ఇంటిపట్టునే ఉండుంటారు. మరి పొలిట్ బ్యూరోలో సభ్యత్వం ఇచ్చారంటే ఇక్కడైనా రెగ్యులర్ గా సమావేశాలకు హాజరవుతారని చంద్రబాబుకు హామీ ఇచ్చారేమో. అందుకనే ఏరికోరి బావమరిదిని పొలిట్ బ్యూరో లో బావయ్య నియమించారు.