జానకీరామ్ చెంతనే హరికృష్ణ అంత్యక్రియలు

Update: 2018-08-29 07:54 GMT
సినీ నటుడు - తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ హరికృష్ణ ఈ ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలియగానే హరికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్  మొత్తం హరికృష్ణ పార్థీవ దేహం ఉన్న కామినేని ఆస్పత్రికి వచ్చి బోరున విలపించారు.  పోస్టుమార్టం అనంతరం హరికృష్ణ పార్టీవ దేహాన్ని ఆయన కుమారులు కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ హైదరాబాద్ కు అంబులెన్స్ లో తరలించారు.

రేపు ఉదయం హరికృష్ణ అంత్యక్రియలు శంషాబాద్  లోని హరికృష్ణ ఫామ్ హౌస్ లో జరుగనున్నాయి.  నాలుగేళ్ల క్రితం నల్గొండ జిల్లాలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జానకీ రామ్ అంత్యక్రియలను కూడా ఇదే ఫామ్ హౌస్ లో నిర్వహించారు. ఇప్పుడు జానకీరామ్ సమాధి పక్కనే హరికృష్ణ అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ నివాళులర్పించేందుకు వీలుగా ముందుగా మెహదీపట్నంలోని హరికృష్ణ ఇంటికి మృతదేహాన్ని తరలిస్తారు. అక్కడి నుంచి పార్టీ ప్రముఖులు, టీడీపీ నేతలు నివాళులర్పించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉంచుతారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అంతిమయాత్ర శంషాబాద్ ఫామ్ హౌస్ వరకూ సాగనుంది.  జానకీ రామ్ సమాధిపక్కనే హరికృష్ణ సమాధిని నిర్మించేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు సమాచారం.

ఇలా తండ్రీ కొడుకులిద్దరూ ఒకే రకమైన ప్రమాదంలో మరణించడం.. చివరకు చివరి మజిలీగా ఫామ్ హౌస్ లోనే పక్కపక్కనే సమాధి అవుతుండడం నందమూరి అభిమానులను కలిచివేస్తోంది. హరికృష్ణ కుటుంబ సభ్యులను తీవ్ర ఉద్వేగానికి గురిచేస్తోంది.
Tags:    

Similar News