కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం....తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో అందరి చూపు పడిన నియోజకవర్గాల్లో అతికొద్ది వాటిల్లో ఒకటి. దివంగత నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని బరిలో దిగిన సంగతి తెలిసిందే. సుహాసిని అనూహ్యంగా కూకట్ పల్లి టికెట్ దక్కించుకున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్దమై నామినేషన్ వేశారు. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న పెద్దిరెడ్డిని కాదని - సుహాసినికి టికెట్ ఇచ్చారు. ఆమెను బరిలోకి దింపడం వ్యూహాత్మకమేనని, ఆ ప్రభావం మొత్తం నందమూరి కుటుంబంపై ఉంటుందని బాబు స్కెచ్ వేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఫలితాల్లో సీన్ రివర్స్ అవుతోంది. ఆమె వెనుకంజలో ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. తొలిరౌండ్ నుంచే ఆమె వెనుకంజలో ఉన్నారు. 8వ రౌండ్ వరకు దాదాపు 9,000 వరకు ఓట్ల వెనుకంజలో ఆమె ఉన్నారు. సుహాసిని గెలుపుకోసం శనివారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. అమరావతిలో నాలుగు ఇటుకలు కూడా వేయలేదంటున్నారని.. అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వస్తుందన్నారు. ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు సైబరాబాద్ సృష్టికర్తను... ఇప్పుడు అమరావతి సృష్టికర్తనన్నారు. దేశంలోనే ఎక్కడాలేని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ లోనే ఉందని చెప్పారు. అంతా హోరాహోరీగా సాగిన ప్రచారంలో ఆమె ప్రతి రౌండ్ లోనూ వెనుకంజ వేయడం కీలకంగా మారింది.