నంద్యాల ఎమ్మెల్యే ఫ్యామిలీ హ‌ర్ట‌యిందా? రీజ‌నేంటి?

Update: 2021-07-29 09:29 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్ర కిశోర్‌రెడ్డి కుటుంబం హ‌ర్ట‌యిందా?  వైసీపీ త‌ర‌ఫున కొన్నేళ్లుగా తాము ఇక్క‌డ ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నా.. గుర్తింపు లేకుండా పోతోంద‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం ఏంటంటే.. స్థానిక ఎన్నికల్లో ప‌ద‌వుల విష‌యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణ‌య‌మేన‌ని తెలుస్తోంది. గ‌త మార్చిలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌లు ఎంతో క‌ష్టించారు.  కొంద‌రు ప‌ద‌వుల కోసం మ‌రింత శ్ర‌మించారు.

ఈ క్ర‌మంలో స్థానిక స‌మ‌రంలో విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. మునిసిపాలిటీ చైర్మ‌న్లు, చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వులు త‌మ వారికి ద‌క్కుతాయ‌ని ఆశించారు. అయితే.. అనూహ్యంగా వైసీపీ అధిష్టానం.. ఆయా ప‌ద‌వుల్లో మ‌హిళ ల‌కు పెద్ద పీట వేస్తూనే.. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ కు క‌ష్ట‌ప‌డ‌డ‌మే త‌ప్ప‌.. ప‌ద‌వులు ద‌క్కుతాయా? అని అనుకున్న వ‌ర్గాల‌కు .. కూడా ప‌ద‌వులు ద‌క్కాయి. ఇది ఒక‌ర‌కంగా మంచి ప‌రిణామ‌మే. అయితే..ఇదే. ఇప్పుడు పార్టీలో ప‌ద‌వుల కోసం ఆశ పెట్టుకున్న వారిని నిరాశ‌కు గురి చేసింది.

నంద్యాల మునిసిపాలిటీపై ఆది నుంచి శిల్పా ర‌విచంద్ర కిశోర్ కుటుంబం దృష్టి పెట్టింది. టీడీపీకి చెక్ పెట్టి.. ఇక్క‌డ పాగా వేయ‌డం ద్వారా.. త‌న స‌తీమ‌ణి నాగినిని చైర్ ప‌ర్స‌న్ చేసుకునేందుకు ఎమ్మెల్యే తీవ్రం గానే శ్ర‌మించారు. నాగిని రెడ్డి నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉన్నారు. వైసీపీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ కూడా వినిపించారు.  అనుకున్న‌ట్టుగానే ఇక్క‌డ విజ‌యం ద‌క్కించు కున్నారు. దీంతో త‌న స‌తీమ‌ణి చైర్ ప‌ర్స‌న్ అయిపోతారంటూ.. ఎమ్మెల్యే శిల్పా.. ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే.. చైర్ ప‌ర్స‌న్ ఎంపిక విష‌యానికి వ‌చ్చేస‌రికి.. దీనిని ముస్లింమైనారిటీ కి కేటాయించారు. దీంతో క‌నీసం మున్సిప‌ల్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వైనా ద‌క్కుతుంద‌ని నాగినిరెడ్డి భావించారు. ఆ ప‌ద‌విని బ‌లిజ సామాజిక వ‌ర్గానికి కేటాయించ‌డంతో వాస‌గిరి విజ‌య‌భాస్క‌ర్‌ను ఎన్నుకోవాల్సి వ‌చ్చింది.  ఫ‌లితంగా.. ఇంత క‌ష్ట‌ప‌డి.. పార్టీని విజ‌య‌తీరం చేరిస్తే..ప‌ద‌వుల విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. శిల్పా వ‌ర్గం.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. అయితే..ఇప్పుడు రెండో వైఎస్ చైర్మ‌న్ ప‌ద‌వి ఉంటుంద‌ని ఆశ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఇది కూడా ద‌క్కేవ‌ర‌కు ఛాన్స్ లేద‌ని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబం తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News